Friday, December 20, 2024
HomeSupreme Court On Jagan Case: జగన్‌ అక్రమాస్తుల కేసుపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

Supreme Court On Jagan Case: జగన్‌ అక్రమాస్తుల కేసుపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

Supreme Court On Jagan Case: ఏపీ సీఎం జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో విచారణ ఎందుకు ఆలస్యమవుతోందని సీబీఐని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

కేసు విచారణ ఆలస్యానికి గల కారణాలు తెలుపుతూ నాలుగు వారాల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ధర్మాసనం ఆదేశించింది.

డిశ్చార్జ్‌ పిటిషన్ల కారణంగా జాప్యమవుతోందని సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్ ఎస్‌వీ రాజు కోర్టుకు తెలిపారు.

రాజకీయ కారణాలతో ట్రయల్‌ ఆలస్యం కాకూడదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రాజకీయ నేత, ఏపీ సీఎం అనే కారణాలతో విచారణలో జాప్యం జరగకూడదని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా అన్నారు.

బెయిల్‌ రద్దు, కేసు విచారణ తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ పిటిషన్ల(Supreme Court On Jagan Case)ను కలిపే విచారణ చేపడతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 5కు వాయిదా వేసింది.

READ LATEST TELUGU NEWS: ఈ ఐదు అంశాలు.. అడ్డుప‌డ‌తాయా? ఆదుకుంటాయా?

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS