Thursday, December 19, 2024
HomeWater Crisis In Telangana: జులైలో నీటి కొరత రాబోతుంది!

Water Crisis In Telangana: జులైలో నీటి కొరత రాబోతుంది!

Water Crisis In Telangana: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రజల అవసరాలకు రోజుకు 4,400 మిలియన్‌ లీటర్ల (ఎంఎల్‌డీ – మిలియన్‌ లీటర్స్‌ పర్‌ డే) నీళ్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు పట్టణ ప్రాంతాల్లో 1,200; గ్రామీణ ప్రాంతాల్లో 3,200 ఎంఎల్‌డీ నీళ్లు అవసరం.

సెంట్రల్‌ పబ్లిక్‌హెల్త్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌ ఆర్గనైజేషన్‌ (సీపీహెచ్‌ఈఈవో) అంచనాల మేరకు ప్రతి వ్యక్తికి గ్రామీణ ప్రాంతాల్లో సగటున రోజుకు 70, పట్టణ ప్రాంతాల్లో 100-135 లీటర్ల నీళ్లు అవసరమని ఉన్నతాధికారి ఒకరు వివరించారు.

ఈ మేరకు రాష్ట్ర అవసరాలకు తగినంత కంటే మించి తాగునీటి లభ్యత ఉన్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో కొద్ది వారాలుగా వర్షాభావ(Rain Water Scarcity) పరిస్థితులు నెలకొనడంతో రిజర్వాయర్లలో నీటిని సైతం పొదుపుగా వినియోగిస్తూ వస్తున్నారు.

Read Also: బెంగళూరు పరిస్థితి ఏ నగరానికి రావొద్దు

జులై చివరి వారం వరకు రాష్ట్రంలో నీటి కొరత(Water Scarcity) వచ్చే పరిస్థితి ఉండదని ఉన్నతాధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు. రాష్ట్రంలో పని చేయని, గత కొన్నేళ్లుగా వినియోగించని బోర్లను అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు.

Water scarcity
నీటి కొరత వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చూశారా!

తాగునీటి సరఫరా కోసం నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గడిచిన నెలల్లో నీటిపారుదల, పురపాలక, పంచాయతీరాజ్‌, విద్యుత్‌ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశాల్లో స్పష్టం చేశారు.

నిర్వహణ కోసం ఎక్కడైనా విద్యుత్‌ను నిలుపుదల చేయాల్సిన పరిస్థితి ఉంటే ఆయా ప్రాంతాల పురపాలక, పంచాయతీరాజ్‌ శాఖ అధికారులకు ముందస్తు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.

రాష్ట్రవ్యాప్తంగా నీటి సరఫరా పరిస్థితిపై ప్రతి రోజూ సీఎస్‌కు జిల్లా కలెక్టర్లు నివేదికలు పంపేలా ఏర్పాట్లు చేశారు.

Read Also: సమ్మర్ ఎఫెక్ట్.. ఆ 16 జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ

నిధుల కేటాయింపు..

ప్రస్తుత వేసవిలో తాగునీటి సరఫరా సాఫీగా సాగేందుకు ప్రభుత్వం పురపాలక శాఖకు రూ.40 కోట్లు, పంచాయతీలకు రూ.100 కోట్లు కేటాయించింది.

రాష్ట్ర అవసరాల మేరకు సరఫరా చేసేందుకు రిజర్వాయర్లలో కూడా నీటి నిల్వలు తగినంత ఉన్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు.

వాటి నుంచి తగిన రీతిలో నీటిని విడుదల చేసేందుకు ఇప్పటికే కార్యాచరణను సైతం రూపొందించారు. వచ్చే నెలలో కొన్ని రిజర్వాయర్ల నుంచి నీటిని విడుదల చేసేందుకు కసరత్తు జరుగుతోంది.

కర్ణాటకలో నెలకొన్న నీటి ఎద్దడి(Water Crisis In Telangana)తో పోలిస్తే తెలంగాణలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంటుందని ఓ అధికారి వివరించారు. పురపాలికలు, పంచాయతీల్లో డిసెంబరు నుంచే వేసవి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం అయినట్లు తెలిపారు.

తాగునీటి సమస్య(Water Problem) రాకుండా ఉండేందుకు ప్రభుత్వం విస్తృత స్థాయిలో రోజువారీ సమీక్షలు నిర్వహిస్తున్నట్లు పురపాలక శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

READ LATEST TELUGU NEWS: హైదరాబాద్ సహా దేశంలో 30 నగరాలకు నీటి కొరత

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS