Friday, December 20, 2024
HomeRevanth In Yadadri: సీఎం హోదాలో మొదటిసారి యాదాద్రికి రేవంత్

Revanth In Yadadri: సీఎం హోదాలో మొదటిసారి యాదాద్రికి రేవంత్

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి సీఎం రేవంత్ రెడ్డి తన సతీమణితో కలిసి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, అమ్మవారికి ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ రోజు ప్రారంభమైన బ్రహ్మోత్సవాలకు తొలిరోజున సీఎం రేవంత్ రెడ్డి(Revanth In Yadadri) సతీసమేతంగా హాజరయ్యారు.

యాదాద్రీశుడికి సీఎం రేవంత్ ప్రత్యేక పూజలు చేశారు. సీఎం హోదాలో తొలిసారిగా(Revanth In Yadadri) ఆలయానికి వచ్చిన రేవంత్‌కు ఉత్తర ద్వారం వద్ద ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గర్భగుడిలో స్వామివారిని దర్శించుకుని ప్రధానాలయ ముఖ మంటపంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఉత్సవమూర్తులకు అష్టోత్తర పూజలను ముఖ్యమంత్రి రేవంత్ నిర్వహించారు.

సీఎం దంపతులకు ఆలయ పండితులు వేదాశీర్వచనం అందించారు. స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటం అందచేశారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, విప్ బీర్ల అయిలయ్య తదితరులు ఉన్నారు.

READ LATEST TELUGU NEWS: కరీంనగర్‌ ఎంపీగా నేనే గెలుస్తా: బోయినపల్లి వినోద్ కుమార్

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS