ప్రజాశాంతి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రముఖ సినీ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్(Babu Mohan) నియమితులయ్యారు. ఇవాళ హైదరాబాద్ జరిగిన మీడియా సమావేశంలో ఆ పార్టీ అధినేత కేఏ. పాల్ ప్రకటించారు.
అనంతరం కేఏ. పాల్ మాట్లాడుతూ ‘ప్రజల కోరిక మేరకు ఎంపీ ఎలక్షన్లలో రాష్ట్రంలోని 17 సెగ్మెంట్లలో క్యాండిడేట్లను బరిలోకి దింపుతున్నాం. తమ ప్రజాశాంతి పార్టీ తరపున తొలి అభ్యర్థిగా వరంగల్ స్థానానికి బాబు మోహన్(Babu Mohan)ను ఇప్పటికే ప్రకటించాం. ఆయన పార్టీలో చేరిన తర్వాత అనేక మంది నాయకులు ప్రజాశాంతిలో చేరుతామని ముందుకు వస్తున్నారు. తెలంగాణలో బీజేపీకి ఓటు బ్యాంకు లేదు. అందుకే కాంగ్రెస్‌లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు మరో వ్యక్తి ఏక్ నాథ్ షిండే అయ్యే అవకాశం ఉంది’ అని పాల్ ఆరోపించారు.
READ LATEST TELUGU NEWS: కాపులంతా ప్రజాశాంతి పార్టీలో చేరండి : కేఏ పాల్