Friday, December 20, 2024
HomeFirst List Of MP Candidates: కాంగ్రెస్ అభ్యర్థుల తొలిజాబితా విడుదల.. వయనాడ్ నుంచే రాహుల్

First List Of MP Candidates: కాంగ్రెస్ అభ్యర్థుల తొలిజాబితా విడుదల.. వయనాడ్ నుంచే రాహుల్

లోక్‌సభ ఎలక్షన్లలో పోటీచేయనున్న అభ్యర్థుల తొలి జాబితా (First List Of MP Candidates)ను కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది. మొదటి విడతలో మొత్తం 39 అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ జాబితాలో తెలంగాణ నుంచి నలుగురు క్యాండిడేట్లను ఎంచుకుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి కేరళలోని వయనాడ్ నుంచే పోటీచేయనున్నట్లు స్పష్టం చేసింది.

పార్లమెంటు ఎన్నికలకు అన్నీపార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఇప్పటికే అధికార బీజేపీ తొలివిడతలో ఏకంగా 195 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తమ తొలిజాబితాను రిలీజ్ చేసింది.

తెలంగాణలో నలుగురికి అవకాశం

తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉండగా.. మొదటి జాబితాలో 4 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీచేయబోయే అభ్యర్థులను (TS Congress MP Candidates) కాంగ్రెస్ ప్రకటించింది. జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కార్, నల్గొండ నుంచి మాజీమంత్రి కుందూరు జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్‌లను బరిలో దించుతున్నట్లు పేర్కొంది. మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్ రెడ్డికి టికెట్ ఇచ్చింది.

వయనాడ్ నుంచే రాహుల్ గాంధీ

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీచేస్తారని వచ్చిన వదంతులకు ఈ లిస్ట్ చెక్ పెట్టింది. ఆయన మరోసారి వయనాడ్ నుంచే పోటీలో నిలుచుంటున్నట్లు కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టం చేసింది. ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం బూపేష్ బఘేల్.. రాజ్‌నంద్ గావ్ నియోజకవర్గం నుంచి, శశిథరూర్ తిరువనంతపురం నుంచి బరిలో దిగుతున్నారు. ఇక కర్నాటక ఉపముఖ్యమంత్రి డీకే. శివకుమార్ సోదరుడు డీకే. సురేష్ బెంగళూరు గ్రామీణ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు.

First List of Congress MP candidates for Lok Sabha Elections 2024

మొదటిజాబితాలో కేరళకే అగ్రస్థానం

కాంగ్రెస్ ప్రకటించిన తొలిజాబితాలోని 39 అభ్యర్థుల్లో అత్యధికంగా కేరళ నుంచి 16 మంది ఉన్నారు. కర్ణాటక నుంచి ఏడుగురు, ఛత్తీస్‌గఢ్ నుంచి ఆరుగురు, తెలంగాణ నుంచి నలుగురికి చోటు దక్కింది. మేఘాలయలో ఇద్దరు, సిక్కిం, నాగాలాండ్, త్రిపుర, లక్ష్యద్వీప్‌ల నుంచి ఒక్కొక్కరికి ఈ లిస్టులో స్థానం కల్పించారు.

కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం తర్వాతే..

ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఆ కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. ఈ మీటింగ్‌కు సీపీపీ నేత సోనియాగాంధీ, ఏఐసీసీ ప్రధానకార్యదర్శి కేసీ వేణుగోపాల్ హాజరయ్యారు. ఈ సమావేశంలో అభ్యర్థుల తీరుతెన్నులపై పూర్తి కసరత్తు చేశాకే ఫస్ట్ లిస్ట్(First List Of MP Candidates) రిలీజ్ చేసినట్లు సమాచారం.

ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ హాజరయ్యారు. వీరితో పాటు సీనియర్ నాయకులు అధీర్ రంజన్ చౌదరి, అంబికా సోనీ, జైరాం రమేష్, టీఎం సింగ్ దేవ్, ముకుల్ వాస్నిక్ మీటింగ్‌లో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడ్ యాత్రలో బిజీగా ఉండటంతో వర్చువల్‌గా ఈ మీటింగ్‌లో పాల్గొన్నారు.

READ LATEST TELUGU NEWS : ఒకే స్టేజీపై సీఎం రేవంత్‌తో ప్రధాని మోడీ ముచ్చట

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS