Monday, December 23, 2024
Homeప్రభుత్వం గుడ్ న్యూస్.. త్వరలో మహిళలకు వడ్డీ లేని రుణాలు

ప్రభుత్వం గుడ్ న్యూస్.. త్వరలో మహిళలకు వడ్డీ లేని రుణాలు

-By CORRESPONDENT

ఆశావర్కర్లకు.. అంగన్‌వాడీలకు సకాలంలో జీతాలిస్తాం: భట్టి విక్రమార్క

Dwcra Women Bank Loans: 6 గ్యారెంటీల హామీలతో తెలంగాణ అధికార పీఠాన్ని చేజిక్కుంచుకున్న కాంగ్రెస్.. డ్వాక్రా మహిళలకు శుభవార్త చెప్పింది. గత కొన్నేళ్లుగా నిలిపేసిన డ్వాక్రా రుణాలను తిరిగి ప్రారంభిస్తామని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) ప్రకటించారు. భద్రచలంలోని ఐటీడీఏ కార్యాలయంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వర రావుల ఆధ్వర్యంలో జరిగిన పాలకమండలి సమావేశంలో ఈ నిర్ణయం వెల్లడించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల అమలులో భాగంగా ఇప్పటికే మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించింది. వీటితో పాటు ఇతర హామీలను సైతం నెరవేర్చేందుకు రేవంత్ సర్కార్ అన్నివిధాల ప్రయత్నిస్తోంది. తాజాగా మహిళలకు వడ్డీ లేని రుణాలు (Dwcra Women Bank Loans) ఇస్తామని ప్రకటించి మరో అడుగు ముందుకేసింది. అటు అశా వర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బందికి సైతం సకాలంలో జీతాలు అందేలా చూస్తామనీ భట్టి చెప్పడం మరో విశేషం. దీంతో తెలంగాణ మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికల ముందే ప్రకటన.. వర్కౌట్ అయ్యేనా!!

6 గ్యారంటీల పథకాలతో తెలంగాణలో ఇందిరమ్మ పాలన నడుస్తోందని కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దఎత్తున ప్రచారం చేస్తోంది. త్వరలో రాష్ట్రంలో పార్లమెంట్ ఎలక్షన్లు జరగబోతున్నాయి. లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ ఇలాంటి పథకాలపై ప్రకటన చేస్తోందనే బీఆర్ఎస్, బీజేపీల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే 17 పార్లమెంట్ స్థానాలున్న తెలంగాణలో 12 నుంచి 15 వరకు గెలవాలనే ఆశయంతోనే కాంగ్రెస్ పథకాలు రచిస్తోంది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై అక్కడక్కడా వ్యతిరేకత వస్తోన్నా.. సానుకూల స్పందన శాతమే ఎక్కువ కనిపిస్తోంది. ఈ భావనే కాంగ్రెస్ పార్టీకి లోక్‌సభ ఎన్నికల్లోనూ ప్లస్ అవుతుందని అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. మరి ప్రజలు కాంగ్రెస్ తరుఫున ఎంతమందిని పార్లమెంట్‌కు పంపుతారో వేచిచూడాలి.

READ ALSO: రాజధాని ఫైల్స్ అనే మూవీకి చంద్రబాబు మద్దతు ఎందుకు ఇస్తున్నారు?

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS