ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Kejriwal Arrest) అరెస్ట్ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ కేసు స్కాంలో (Delhi Liquor Case) అరవింద్ కేజ్రీవాల్ అనుమానితుడిగా ఉన్నాడని ఈడీ ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది. ఈ కేసు విషయమై ఇప్పటికే దాదాపు 13 సార్లు ఈడీ విచారణకు హాజరుకావాల్సిందిగా కేజ్రీవాల్‌కు నోటీసులు పంపుతూనే ఉంది.
అయినా కేజ్రీవాల్ ఆ నోటీసులకు స్పందించలేదు. విచారణకు హాజరు కూడా కాలేదు. దాంతో మార్చి 21న సాయంత్రం ఈడీ ఆయన ఇంట్లో సోదాలు చేసి అరెస్ట్ వారెంట్ చూపించి మరీ కస్టడీలో(Kejriwal Arrest)కి తీసుకుంది. దాంతో ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఎన్నికలకు ముందే ఎందుకు?
అయితే.. 13 సార్లు సమన్లు ఇచ్చి ఇప్పుడు సరిగ్గా లోక్ సభ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఐదో సారి సమన్లు ఇచ్చినప్పుడో లేదా ఎనిమిదో సారి ఇచ్చినప్పుడో ఎందుకు చేయలేదు అని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.
అరెస్ట్ అయిన రెండో సీఎం ఈయనే
అరవింద్ కేజ్రీవాల్‌కి ముందు ఈడీ ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్‌ను అరెస్ట్ చేసారు. ఆయన తర్వాత అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాలే కావడం గమనార్హం. ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌కు తాత్కాలిక బెయిల్ కల్పించలేమని ఢిల్లీ హైకోర్టు తేల్చి చెప్పడంతో ఈడీకి మార్గం సులువైంది. లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన సమయంలోనే దేశ రాజధాని అయిన ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్ట్(Kejriwal Arrest) చేయడంతో రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆల్రెడీ జైల్లో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి
ఇదే ఢిల్లీ లిక్కర్ కేసులో రెండేళ్ల క్రితం ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా (Manish Sisodia) అరెస్ట్ అయ్యారు. ఆయన్ను కూడా ఇదే ఈడీ అరెస్ట్ చేసింది.
గత వారం ఎమ్మెల్సీ కవిత
ఇదే లిక్కర్ స్కాంలో ఈడీ అరెస్ట్ చేసిన వారిలో భారత రాష్ట్ర సమితి (BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఈ నెల 22 వరకు కవిత ఈడీ రిమాండ్‌లో ఉండనున్నారు.
READ LATEST TELUGU NEWS: సుప్రీం కోర్టులో ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురు