పేదింటి ఆడపిల్లలపెళ్లిలకు ఆర్థిక భరోసాగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నాడు కేసీఆర్ ప్రవేశపెట్టి నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచారని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) అన్నారు.
శుక్రవారం సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులుతో పాటు 59జీవో పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. గతంలో కేసీఆర్ ఎన్నికల హామీలో ఈ పథకాలు లేకున్నా మానవీయ కోణంలో స్పందించి ఇలాంటి పథకాలను తీసుకొచ్చారన్నారు. కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి కింద లక్ష రూపాయలు, తులం బంగారం ఇస్తామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం తులం బంగారం వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని హరీశ్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు.
READ LATEST TELUGU NEWS : జీవో నంబర్ 3ను రద్దు చేయాలి.. ఎమ్మెల్సీ కవిత డిమాండ్