Thursday, October 17, 2024
HomeతెలుగుతెలంగాణHarish Rao: బ్యాంకు అధికారులు రజాకార్లను తలపిస్తున్నారు: హరీశ్ రావు

Harish Rao: బ్యాంకు అధికారులు రజాకార్లను తలపిస్తున్నారు: హరీశ్ రావు

రైతులు క్రాప్ లోన్లు కట్టనందుకు బ్యాంకు అధికారులు రజాకార్లను తలపించేలా ప్రవర్తిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) అన్నారు. ఇవాళ తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

గత పదేళ్లలో ఎప్పుడూ రైతులకు ఇలాంటి పరిస్థితి లేదని రైతులే చెబుతున్నారన్నారని హరీశ్ రావు ఈ సందర్భంగా అన్నారు. రాష్ట్రంలో సాగునీరు లేదని.. కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదన్నారు.

సాగు నీరు లేక రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారన్నారని హరీశ్ ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు ఎండిపోతుంటే రైతన్న కన్నీటి పర్యంత మవుతున్నారన్నారు. రైతులంగా తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని హరీశ్ రావు(Harish Rao) చెప్పారు. రాష్ట్రం లో పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇతర పార్టీల నుంచి చేరికలపై తప్ప రైతుల గురించి సీఎంకు ఆలోచన లేదని హరీశ్ రావు మండిపడ్డారు. రైతులు కష్టాల్లో ఉంటే బ్యాంకుల వాళ్లు అప్పుల గురించి నోటీసులు ఇస్తున్నారని తెలిపారు. అప్పులు కట్టాలని బ్యాంకుల వాళ్లు రైతులను ఇబ్బంది పెడుతున్నారన్నారు.

బకాయిలు కట్టకపోతే ఆస్తులు జప్తు చేస్తామని బ్యాంకు అధికారులు బెదిరిస్తున్నారని హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీపైనే మొదటి సంతకం చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారని ఆయన గుర్తు చేశారు.

వంద రోజులైనా సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ అంశంపై నిర్ణయం తీసుకోలేదని హరీశ్ రావు(Harish Rao) ఆరోపించారు. రైతులకు ఇచ్చిన నాలుగు హామీలు ఇప్పటి వరకు ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు.

READ LATEST TELUGU NEWS :కాంగ్రెస్ గూటికి మేయర్‌ గద్వాల విజయలక్ష్మి?

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS