Thursday, December 19, 2024
HomeFake Police: తెలంగాణలో నకిలీ పోలీస్ అరెస్ట్

Fake Police: తెలంగాణలో నకిలీ పోలీస్ అరెస్ట్

పోలీసునని నమ్మిస్తూ బ్యూటీ పార్లర్లు, మసాజ్ సెంటర్ల యజమానుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిని మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. గుడి మల్కాపూర్‌కు చెందిన మరికొండ సాయికిరణ్ తేజ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో జల్సాలకు అలవాటు పడి డబ్బు సంపాదన కోసం నకిలీ పోలీసు (Fake Police) అవతారం ఎత్తాడు.

క్రైమ్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్‌లో డిటెక్టివ్‌గా పనిచేస్తున్నట్లు నకిలీ పోలీసు(Fake Police) గుర్తింపు కార్డు సంపాదించాడు. కొన్ని రోజులుగా బ్యూటీ పార్లర్ల యజమానులకు డిటెక్టివ్ కార్డు చూపించి బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తునట్టు ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందింది.

సాయికిరణ్ రాయదుర్గంలోని ఫార్చ్యూన్ అపార్ట్మెంట్లో ఉన్న 5వ ఫ్లోర్లో స్టార్ వెల్నెస్ అండ్ ఫ్యామిలీ సెలూన్ యజమానిని బెదిరించి రూ. 10 వేలు తీసుకుని బయటకు వస్తుండగా అతడిని ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

విచారణ కోసం రాయదుర్గం నిందితుడు సాయికిరణ్‌ను పోలీసులకు అప్పగించారు. నిందితుడి నుంచి రూ.10 వేల క్యాష్, మొబైల్ ఫోన్, హోండా యూనికాన్ బైక్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

READ LATEST TELUGU NEWS: ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసై .. రూ.15 కోట్ల అప్పులు

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS