ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం (Accident In Tirupati) జరిగింది. ఫ్లైఓవర్ మీద రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొని పల్టీ కొట్టడంతో యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్ పోలీసులు, ఉన్నతాధికారులు దృష్టి సారించి ఇకనైనా ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు.