Friday, December 20, 2024
HomeGHMC Mayor: కాంగ్రెస్ గూటికి మేయర్‌ గద్వాల విజయలక్ష్మి?

GHMC Mayor: కాంగ్రెస్ గూటికి మేయర్‌ గద్వాల విజయలక్ష్మి?

జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి(GHMC Mayor) కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. హైదరాబాద్‌పై పట్టు సాధించేందుకు కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇటీవలే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఆయన సతీమణి శ్రీదేవి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

ఇటీవలే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సైతం కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. అయితే మున్సిపల్ కార్పొరేషన్‌ను హస్తగతం చేసుకునేందుకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షి రంగంలోకి దిగారు.

దీపాదాస్ మున్షి నేరుగా ఎంపీ కేకే ఇంటికే వెళ్లారు. గద్వాల విజయలక్ష్మి(GHMC Mayor)ని పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. ఈ భేటీ‌పై విజయలక్ష్మి స్పందించారు. కార్యకర్తలతో చర్చించిన తర్వాత నిర్ణయం వెల్లడిస్తానని తెలిపినట్టు మీడియాకు చెప్పారు.

రెండు సార్లు తనను గెలిపించిన కార్యకర్తలకు చెప్పకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోలేనని అన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి అడుగులు కాంగ్రెస్ వైపు పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

READ LATEST TELUGU NEWS: ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS