Wednesday, March 4, 2026
HomeOm Bheem Bush Review: ‘ఓం భీమ్‌ బుష్‌’ మూవీ రివ్యూ

Om Bheem Bush Review: ‘ఓం భీమ్‌ బుష్‌’ మూవీ రివ్యూ

శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో, డైరెక్టర్ శ్రీహర్ష కోనుగంటి దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ‘ఓం భీమ్ బుష్’. కాగా ఈ చిత్రం మార్చి 22న విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలో(Om Bheem Bush Review)కి వెళ్లి తెలుసుకుందాం!

ఏడిపించడం చాలా ఈజీ కానీ కామెడీ చేసి నవ్వించడం చాలా కష్టం అనేది ఎక్కువగా వినిపించే మాట. ఇందులో చాలా వరకూ వాస్తవం కూడా ఉంది. అందుకే కొంతమంది నవ్వించడానికి ఎంత ట్రై చేసినా జనాల ముఖంలో ఎలాంటి ఎక్స్‌ప్రెషన్ ఉండదు.

కానీ కొంతమందిని చూస్తేనే నవ్వొస్తుంది. ఇక వాళ్లు నోరు విప్పితేనే కడుపుబ్బా నవ్వాల్సిందే. అలాంటి యాక్టర్స్ చాలా అరుదుగా ఉంటారు. అందులో శ్రీవిష్ణు కూడా ఒకడు. అసలు శ్రీవిష్ణు కామెడీ టైమింగ్‌, డైలాగ్ డెలివరీ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది.

శ్రీవిష్ణు పైకి ఎంత సింపుల్‌గా కనిపిస్తాడో అంతకుమించి నవ్విస్తాడు. ఇక నవ్వుల ఆటంబాంబు లాంటి శ్రీవిష్ణుకి జాతిరత్నాలైన ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ తోడవ్వడంతో దెబ్బకి కామెడీతో థియేటర్లో దీపావళి చేసేశారు.

Om Bheem Bush Review: ‘ఓం భీమ్ బుష్’ సినిమాలో మొదటి నుంచి చివరి వరకూ ఎప్పుడు స్క్రీన్ మీద ముగ్గురు బ్యాంగ్ బ్రోస్ కనిపించినా థియేటర్లో జనాలు పడిపడి నవ్వుతూనే ఉన్నారు. ఇక సినిమాలో ఓ మూడు-నాలుగు కామెడీ సీక్వెన్స్‌ల్లో అయితే జనాలను మాములుగా ఎంటర్‌టైన్ చేయలేదు. అరిపించారు అంతే.

ముఖ్యంగా టాలీవుడ్‌లో ఇటీవలి కాలంలో బాగా ట్రోల్, వైరల్ అయిన కామెడీ డైలాగులతో బ్యాంగ్ బ్రోస్ ఓ ఆట ఆడుకున్నారు. ఫస్టాఫ్ అంతా అలా సరదాసరదాగా సాగిపోతే సెకండాఫ్‌లో మాత్రం కొన్ని చోట్ల హర్రర్‌తో భయపెట్టారు.

అలానే ఊహించని విధంగా కాస్త సెంటిమెంటును కూడా యాడ్ చేశారండోయ్. ముఖ్యంగా సెకండాఫ్‌లో దెయ్యంతో హీరో శ్రీవిష్ణు చేసే కామెడీ సినిమాకే హైలెట్‌గా ఉంది. ఇక దెయ్యం చేతిలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ దెబ్బలు తినే సీన్లు కూడా పొట్ట చెక్కలయ్యేలా నవ్వించాయి.

అయితే ‘ఓం భీం బుష్’ సినిమా క్లైమాక్స్‌‌ను మాత్రం ఊహించని విధంగా ప్లాన్ చేశారు డైరెక్టర్ హర్ష కోనుగంటి. అప్పటివరకూ కామెడీగా సాగిపోతున్న చిత్రానికి కాస్త సెంటిమెంట్ జోడించి చిన్న సందేశంతో హ్యాపీగా ముగించారు.

ప్లస్ పాయింట్స్:

1. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కామెడీ
2. మొదటి నుంచి చివరి వరకు నవ్వులతో నిండిన కథ
3. హర్రర్ ఎలిమెంట్స్
4. ఊహించని క్లైమాక్స్

మైనస్ పాయింట్స్:

1. కొన్ని సన్నివేశాలు లాజిక్‌కు దూరంగా ఉండటం
2. సెకండాఫ్‌లో కొన్ని సీన్స్ నెమ్మదిగా సాగడం

సినిమా చూడాలా వద్దా?
నవ్వాలని.. థియేటర్లో హాయిగా ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఓం భీమ్ బుష్(Om Bheem Bush Review) ఒక మంచి ఆప్షన్. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కామెడీ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది.

READ LATEST TELUGU NEWS: విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ గామి రివ్యూ

 

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS