Saturday, December 21, 2024
Homenewsభూ పంచాయితీ కేసులో హీరో వెంకటేష్!

భూ పంచాయితీ కేసులో హీరో వెంకటేష్!

By

ఐశ్వర్య రాజ్

టాలీవుడ్ అగ్ర హీరో విక్టరీ వెంకటేష్ ఎప్పుడూ వివాదాల్లో తలదూర్చరు. ఎలాంటి వివాదాల్లో ఆయన పేరు కనిపించదు. సినిమాలకు సంబంధించిన విషయాలలో కూడా వెంకీ తన పని తాను చేసుకుని వెళుతుంటారు. అయితే వెంకటేష్ సోదరుడు సురేష్ బాబు మాత్రం నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా సినిమాలకు సంబంధిత ఆర్ధిక వ్యవహారాలలో ఇన్వాల్వ్ అవుతుండటం తెలిసిందే. అలాంటిది ఏదైనా ఇతర వివాదాల్లో దగ్గుబాటి కుటుంబం కనిపించడం చాలా అరుదు. అయితే తాజాగా దగ్గుబాటి ఫ్యామిలీకి ఊహించని షాక్ తగిలింది.

ఒక వివాదానికి సంబంధించి నాంపల్లి కోర్టు.. హీరో వెంకటేష్, రానా, సురేష్ బాబు, అభిరామ్‌లపై క్రిమినల్ కేసు నమోదు చేయాలనీ ఆదేశాలు జారీ చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఫిలింనగర్‌లో ఉన్న డెక్కన్ కిచెన్ స్థలం విషయంలో నందకుమార్ అనే వ్యక్తికి.. దగ్గుబాటి ఫ్యామిలీకి మధ్య కొన్నేళ్లుగా వివాదం నడుస్తోంది.

ఈ అంశంలో దగ్గుబాటి ఫ్యామిలీ తప్పుడు డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఆ స్థలాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్నారని నందకుమార్ ఆరోపిస్తున్నారు. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ డెక్కన్ కిచెన్ బిల్డింగ్‌ని కూల్చివేసి ఫర్నిచర్ ఎత్తుకుపోయారని. తనకు రూ. 20 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని నందకుమార్ అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ వేశారు.

పిటిషన్‌ను విచారించిన కోర్టు.. ఐపీసీ 448, 452, 380.. ఇలా పలు సెక్షన్ల కింద హీరో వెంకటేష్, రానా, సురేష్ బాబు, అభిరామ్‌లపై క్రిమినల్ కేసు పెట్టాలని ఫిలింనగర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఇంకా.. దగ్గుబాటి కుటుంబ సభ్యుల నుంచి తనకు ప్రాణ హాని ఉన్నట్లుగా నందకుమార్ పిటిషన్‌లో పేర్కొన్నారు. తాను ఒక కేసులో చిక్కుకుంటే దాన్నిఆసరాగా తీసుకుని డక్కన్ కిచెన్‌పై తప్పుడు డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి సమస్యలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. కోర్టు ఆదేశాలతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మరి అంశంపై దగ్గుబాటి ఫ్యామిలీ ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS