By
ఐశ్వర్య రాజ్
శ్రీలీల.. టాలీవుడ్ లో టాప్ లో దూసుకెళ్తున్న హీరోయిన్. తన చలాకీ నటనతో పాటు, హుషారైన డాన్స్ తో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలుగిస్తుంది. తన మెదటి సినిమా ‘పెళ్లి సందడి’ నుండి మొన్నటి ‘భగవంత్ కేసరి’ వరకు హిట్ సినిమా లతో టాలీవుడ్ లో టాప్ లెవల్ లో ఉంది.
తాజా గా మహేష్ బాబు సినిమా ‘గుంటూరు కారం‘ సినిమాలో నటనతో పాటు డాన్స్ లోనూ ఇరగదీసిందని హీరో మహేష్ బాబు తో పాటు త్రివిక్రమ్ కూడా మెచ్చుకున్నారు. గుంటూరు లో మొన్న జరిగిన “గుంటూరు కారం” సినిమా ప్రీ రిలీజ్ వేడుక లో మహేష్ బాబు మాట్లాడుతూ “శ్రీ లీల తో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉందని. మన టాలీవుడ్ లో ఒక తెలుగు అమ్మాయి పెద్ద హీరోయిన్ అవడం చాలా ఆనందంగా ఉందని, శ్రీలీల తో డాన్స్ చేయడం చాలా కష్టం అని, ఆమెతో డాన్స్ హీరోలందరి తాట ఊడటం ఖాయం” అని సరదాగా వ్యాఖ్యానించారు. “క్రమశిక్షణ తో పని చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని” చెప్పుకొచ్చారు.
కాగా ‘గుంటూరు’ కారం సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదలైంది. త్రివిక్రమ్ దర్శకత్వం తో థమన్ మ్యూజిక్ తో ప్రేక్షకులను అలరించి, హిట్ టాక్ తో విజయం దిశగా దూసుకెళ్తుంది.