Saturday, September 14, 2024
HomeతెలుగుతెలంగాణHigh temperatures in Telangana: ఎండలు దంచికొడుతున్నాయ్

High temperatures in Telangana: ఎండలు దంచికొడుతున్నాయ్

High temperatures in Telangana: రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. గత వారం రోజులుగా రోజు రోజుకు ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతూనే ఉన్నాయి.

రానున్న ఐదు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Weather update) తెలిపింది.

తెలంగాణలో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.

నిర్మల్, నిజామాబాద్ , ఆదిలాబాద్, కుమరం భీం, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలకు వడగాలుల హెచ్చరికలు జారీ చేసింది.

Read Also: కరెంటు కోతలు లేకుండా చూడాలి: సీఎం రేవంత్

వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట, మహబూబ్ నగర్ లలో కూడా రేపు, ఎల్లుండి వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

మంగళవారం రామగుండంలో 40.6, నిజామాబాద్‌లో 40, హైదరాబాద్‌లో 39, ఖమ్మంలో 30.2 , ఆదిలాబాద్‌లో 29.8, మెదక్‌లో 30.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు(High temperatures in Telangana)నమోదయ్యాయి.

పలు జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీచాయని వాతావరణ కేంద్రం(IMD) పేర్కొంది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించింది.

READ LATEST TELUGU NEWS: భానుడి భగభగ.. జాగ్రత్తలు తీసుకోవాల్సిందే

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS