Saturday, December 21, 2024
HomeTemperatures in Summer 2024: భానుడి భగభగ.. జాగ్రత్తలు తీసుకోవాల్సిందే

Temperatures in Summer 2024: భానుడి భగభగ.. జాగ్రత్తలు తీసుకోవాల్సిందే

Temperatures in Summer 2024: తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకీ ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెలలోనే వడగాలుల తీవ్రత కూడా మొదలైంది.

భానుడి ప్రతాపంతో ఇటు తెలంగాణ, అటు ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నట్లు వాతావరణ అధికారులు పేర్కొంటున్నారు.

ఇప్పటికే ఉష్ణోగ్రతలు 41 నుంచి 43 డిగ్రీల మధ్యన నమోదవుతున్నాయి. దీంతో పెరుగుతున్న ఎండలకు ఎవరూ బయటకు కూడా రావడంలేదు.

ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన జారీ చేసింది.

Read Also: జులైలో నీటి కొరత రాబోతుంది!

ఇవాళ 50 మండలాల్లో వడగాల్పులు(Summer Heat Waves), రేపు 56 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

శుక్రవారం 31 మండలాల్లో వడగాల్పులు, కడప జిల్లా ముద్దనూరు లో తీవ్ర వడగాల్పులు వీచినట్లు అధికారులు వెల్లడించారు.

ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వడగాల్పులు వీచే అవకాశం ఉన్న దృష్ట్యా చర్యలు తీసుకోవాలని వెల్లడించారు. శనివారం కడప జిల్లా ముద్దనూరులో తీవ్ర వడగాల్పులు నమోదైనట్లు తెలిపారు.

Read Also: హైదరాబాద్ సహా దేశంలో 30 నగరాలకు నీటి కొరత

ఇటు తెలంగాణలో కూడా ఎండలు(Temperatures in Summer 2024) దంచికొడుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి.

దీంతో పలు ప్రాంతాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరో మూడు రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

తీవ్ర ఎండలు(High Temperature) దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. వడదెబ్బ తగలకుండా సరైన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

READLATEST TELUGU NEWS: ఈ 16 జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ.. ఎండలు దంచుడే

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS