Pawan Kalyan Election campaign: ఎన్నికలలో తనను గెలిపిస్తే పీఠాపురంలోనే నివాసం ఉంటానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు.
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల పర్యటన సందర్భంగా ఆయన తొలి రోజు గొల్లప్రోలు మండలం చేబ్రోలులో శనివారం రాత్రి జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని పవన్ కల్యాణ్ చెప్పారు.
పీఠాపురం(Pawan In Pithapuram)లో తనను ఎలాగైనా ఓడించాలని వైసీపీ ప్రయత్నిస్తోందని అన్నారు. చిత్తూరు జిల్లా నుంచి మిథున్ రెడ్డిని తీసుకువచ్చింది.. మండలానికి ఒక కీలక నేతను పెట్టిందని పవన్ అన్నారు.
Read Also: పవన్ కల్యాణ్ తప్పుకుంటే పిఠాపురం నాదే- వర్మ కీలక వ్యాఖ్యలు
నా దగ్గర అంతగా శక్తి లేకపోయినా ఎందుకంత కక్ష పెట్టుకున్నారని పవన్ ప్రశ్నించారు. రాష్ట్రంలో వైసీపీ ఫ్యాన్ సౌండ్ ఎక్కువ, గాలి తక్కువ అని ఎద్దేవా చేశారు.
పిఠాపురం నియోజకవర్గ ప్రజలు తనను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని పవన్ (Pawan Kalyan Election campaign) కోరారు.
21 ఎమ్మెల్యే, రెండు ఎంపీ సీట్లలో మాత్రమే పోటీ చేస్తున్నా.. తనపై వైసీపీ కక్ష కట్టిందన్నారు. వాళ్ల అక్రమాలను భవిష్యత్తులో ప్రశ్నిస్తానని భయపడుతుండడమే ఇందుకు కారణమన్నారు.
READ LATEST TELUGU NEWS: ఏపీలో కాంగ్రెస్ పార్టీ 9 గ్యారెంటీలను ఆవిష్కరించిన షర్మిల