Monday, December 23, 2024
HomenewsKalki 2898 AD లో తప్పులు

Kalki 2898 AD లో తప్పులు

నాగ్ అశ్విన్ తీసిన “కల్కి 2898 ఏడి” సినిమా చాలా గ్రాండ్‌గా ఉందని ప్రముఖ హిందీ నటుడు ముఖేష్ ఖన్నా అన్నారు. ముఖేష్ “మహాభారతం” సీరియ‌ల్‌లో భీష్ముడి పాత్ర‌లో నటించారు. ఈ నేపథ్యంలో “కల్కి” సినిమాలో కొన్ని త‌ప్పులు చూపించార‌ని ఆయన అన్నారు. అశ్వ‌త్థామ నుంచి కృష్ణుడు మ‌ణిని తీసుకోలేదని, ఆ మణిని ద్రౌపది తీసుకున్నదని చెప్పారు. కానీ సినిమాలో కృష్ణుడు తీసుకున్నట్లు చూపించారని, ఇది తప్పు అని పేర్కొన్నారు. అర్జునుడికి అశ్వ‌త్థామ మధ్య యుద్ధంలో అర్జునుడి ప‌వ‌ర్‌ను మాత్రమే రివ‌ర్స్ చేయగలదని, అశ్వ‌త్థామ బ్ర‌హ్మాస్త్రాన్ని అభిమ‌న్యుడి భార్య వైపునకు విసిరాడని వివరించారు. అభిమ‌న్యుడి భార్య‌ను కృష్ణుడు 9 నెల‌లు కాపాడాడని, ఎందుకంటే ఆమె గ‌ర్భవతి అని అన్నారు. కృష్ణుడు అశ్వ‌త్థామ‌ను “నన్ను ర‌క్షించు” అని అడ‌గటం అర్థంకాలేదని, కృష్ణుడి అంత‌టి మొన‌గాడు బ్ర‌హ్మాండంలో ఎవ‌రు లేరని, అలాంటి కృష్ణుడు అశ్వ‌త్థామ‌ను రక్షణ కోసం అడగడం త‌ప్పని అన్నారు. సినిమాల్లో విజిల్స్ కోసం మహాభారతం కథను మార్చడం తప్పు అని అభిప్రాయపడ్డారు.

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS