Premalu Movie Review : మలయాళ సినిమాల ఫ్యాన్స్ ఇక్కడ ఎవరు ఉన్నారు? నేను ఈ రోజు రివ్యూ చేయబోతున్న సినిమా పేరు “ప్రేమలు” . నస్లెన్ హీరోగా, మమితా బైజు హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఈ రోజు తెలుగులో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.సచిన్ , ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ , తన కాలేజీ లైఫ్‌లో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు . కానీ ఆ ప్రేమ విఫలం అవుతుంది . ఆ తరువాత UK వెళ్లాలని ప్లాన్ చేస్తాడు కానీ అది కూడా జరగదు. ఇంట్లో పోరు తట్టుకోలేక హైదరాబాద్‌కు వస్తాడు . అక్కడ రీనూ అనే అమ్మాయి ఐటీ కంపెనీలోఉద్యోగం చేస్తుంది. ఇకపోతే… వీళ్లిద్దరూ ఎలా కలుసుకున్నారు? రీనూ కోరుకున్న అంశాలు ఏవీ సచిన్‌లో లేకపోయినా ఎందుకు అతన్ని ప్రేమిస్తుంది? వీరి ప్రేమ కథ ఎలాంటి మలుపు తీసుకుంటుంది? ……ఇవన్నీ తెలియాలంటే …..సినిమా చూడాల్సిందే!
ప్లస్ పాయింట్స్:
1. ఫీల్ గుడ్ కామెడీ మరియు లవ్ స్టోరీ
2. కొన్ని కామెడీ సన్నివేశాలు బాగున్నాయి
3. ఎమోషనల్‌గా సాగే కొన్ని లవ్ సీన్స్ ఆకట్టుకుంటాయి
4. నస్లెన్ మరియు మమితా బైజు మరియు సంగీత్ ప్రతాప్చాలా బాగా నటించారు
5. సంగీతం
6. సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
1. కొన్ని రెగ్యులర్ సీన్స్ ఉన్నాయి
2. సెకండాఫ్‌లో కొంచెం స్లో నేరేషన్ ఉంది
3. హీరోహీరోయిన్ల మధ్య కొన్ని ల్యాగ్ సీన్స్ ఉన్నాయి
Conculsion:
ప్రేమలు ఒక ఫీల్-గుడ్ లవ్ స్టోరీ. కామెడీ, ఎమోషన్, మంచి నటన, అందమైన దృశ్యాలతో ఈ సినిమా ఆకట్టుకుంటుంది. కొన్ని రెగ్యులర్ సీన్స్ ఉన్నప్పటికీ, ప్రేమికులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా నచ్చుతుంది.
Top Points to watch the Movie :
1. ఈ సినిమా ఒక యువకుడి ప్రయాణం, ప్రేమ గురించి.
2. సినిమాలో కొన్ని హృదయాన్ని తాకే సన్నివేశాలు ఉన్నాయి.
3. నస్లెన్ కె. గఫూర్, మమితా బైజు తమ పాత్రలకు న్యాయం చేశారు.
4. సంగీతం మరియు సినిమాటోగ్రఫీ చాలా బాగున్నాయి.
మీరు ఈ సినిమా (Premalu Movie Review) చూడాలా?
అవును, మీరు ఒక ఫీల్-గుడ్ లవ్ స్టోరీ చూడాలనుకుంటే, ఈ సినిమా మీకు నచ్చుతుంది.
READ LATEST TELUGU NEWS : గ్రామీ అవార్డుల్లో భారత ‘శక్తి’.. సత్తా చాటిన శంకర్ మహదేవన్, జాకీర్ హుస్సేన్