మెగాబ్రదర్ నాగబాబు ( Nagababu ) సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు కోరుతూ ఓ లేఖ విడుదల చేశారు. ఇటీవల పోలీస్ క్యారెక్టర్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. దీంతో పశ్చాతాపానికి గురైన నాగబాబు ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ ( Operation Valentine ) మూవీ మార్చి 1న రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో చిత్రబృందం ఇటీవల ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. కుమారుడి సినిమా వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరైన నాగబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అసలేం జరిగిందంటే..
ఆపరేషన్ ప్రీరిలీజ్ వేడుకలో మాట్లాడిన నాగబాబు.. ఈ కార్యక్రమానికి తన కొడుకు వరుణ్ తేజ్ కోసం రాలేదని చెప్పుకొచ్చారు. దేశ సైనికులు, రియల్ హీరోల గురించి మాట్లాడే అవకాశం ఇలాంటి స్టేజీలపై దొరుకుతుందనే భావనతో ప్రీరిలీజ్ వేడుకకు హాజరయ్యారని తెలిపారు. ఈ క్రమంలో దేశ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ధైర్య సాహాసాల గురించి గొప్పగా మాట్లాడారు.
అలా మాట్లాడుతున్న నాగబాబు స్పీచ్ మధ్యలో పోలీస్ క్యారెక్టర్ గురించి ఓ కామెంట్ చేశారు. 5 అడుగుల 3 అంగుళాలున్న మనిషి.. నేను సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అంటే నమ్మశక్యంగా ఉండదన్నారు. అదే డైలాగ్ 6 అడుగుల 3 అంగుళాలున్న వ్యక్తి చెప్తే బాగుంటుందన్నారు. ఈ వ్యాఖ్యలు కాస్త నెట్టింట్లో వైరల్ అయ్యాయి. దీంతో ఒక హీరోను ఉద్దేశించే నాగబాబు ఇలాంటి కామెంట్ చేశారని ఆయనపై ట్రోల్స్, మీమ్స్‌తో నెటిజన్లు విరుచుకుపడ్డారు. క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు.
నన్ను క్షమించండి: నాగబాబు
ఈ అంశంపై తాజాగా నాగబాబు స్పందించారు. తన వ్యాఖ్యలపై క్షమాపణ కోరారు. ” ఇటీవల జరిగిన వరుణ్ బాబు ‘ఆపరేషన్ వాలెంటైన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నేను పోలీస్ క్యారెక్టర్ 6 అడుగుల 3 అంగుళాలు ఉండే వ్యక్తులు చేస్తే బాగుంటుంది. 5 అడుగుల 3 అంగుళాల వ్యక్తులు చేస్తే నొప్పదు అన్నట్టు మాట్లాడాను. ఆ మాటలు నేను వెనక్కి తీసుకుంటున్నాను. ఎవరైన ఆ మాటలకి నొచ్చుకునుంటే I’m Really Very sorry. అది యాదృచ్ఛికంగా వచ్చిందే కాని Wantedగా అన్న మాటలు కాదు. అందరూ అర్థం చేసుకుని క్షమిస్తారని ఆశిస్తున్నాను” అంటూ మెగా బ్రదర్ ట్విట్టర్‌లో బహిరంగ క్షమాపణ కోరారు.
ఇటీవల జరిగిన వరుణ్ బాబు 'ఆపరేషన్ వాలెంటైన్' ప్రీ రిలిజ్ ఈవెంట్ లో నేను పోలిస్ క్యారెక్టర్ 6 అడుగుల మూడు అంగుళాలు ఉండే వ్యక్తులు చేస్తే బాగుంటుంది 5 అడుగుల మూడు అంగుళాలు వ్యక్తులు చేస్తే నొప్పదు అన్నట్టు మాట్లాడాను,ఆ మాటలు నేను వెనక్కి తీస్కుంటున్నాను,ఎవరైన ఆ మాటలకి… pic.twitter.com/Ppr44YcqI8
— Naga Babu Konidela (@NagaBabuOffl) February 29, 2024
స్పందించిన హీరో వరుణ్ తేజ్
మరోవైపు తండ్రి నాగబాబు వ్యాఖ్యలపై హీరో వరుణ్ తేజ్ కూడా స్పందించారు. తన తండ్రి ఏ హీరోను కించపరచాలనే ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదన్నారు. తన హైట్‌పై కామెంట్ చేస్తూ చిన్న పోలిక చేశారని క్లారిటీ ఇచ్చారు.
కాగా వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ కాంబినేషన్‌లో శక్తి ప్రతాప్ సింగ్ తెరకెక్కించిన ఆపరేషన్ వాలెంటైన్ రేపు రిలీజ్ కాబోతుంది. 2019లో జరిగిన పుల్వామా దాడి కథాంశంతో ఈ మూవీ రూపొందించారు. తెలుగు, హిందీ భాషల్లో విడుదల కాబోతున్న ఈ చిత్రంలో నవదీప్, రుహానీ శర్మ కీలకపాత్రల్లో నటించారు.
READ LATEST TELUGU NEWS: భారత ‘శక్తి’కి గ్రామీ అవార్డు.. హ్యాట్సాఫ్ శంకర్ మహాదేవన్, జాకీర్ హుస్సేన్