Friday, November 22, 2024
HomeBREAKING - Gummanur Jayaram : జగన్‌కు షాక్.. వైసీపీకి మంత్రి జయరాం రాజీనామా

BREAKING – Gummanur Jayaram : జగన్‌కు షాక్.. వైసీపీకి మంత్రి జయరాం రాజీనామా

BREAKING NEWS: ఏపీలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ తరుణంలో నేతలు పార్టీలు మారుతూ అధిష్ఠానానికి షాక్‌లిస్తున్నారు. తాజాగా మంత్రి గుమ్మనూరు జయరాం (Gummanur Jayaram) వైసీపీకి, మంత్రి పదవికి రాజీనామా చేశారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించారు.

EX Minister Gummanur Jayaram Joins TDP
EX Minister Gummanur Jayaram Joins TDP

ఏపీలో వైసీపీ చేస్తున్న మార్పులు చేర్పులు సీనియర్ నేతలకు మింగుడు పడటం లేదు. ఇన్‌ఛార్జ్‌ల మార్పుల వల్ల కర్నూలు జిల్లా ఆలూరు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఈ పరిస్థితుల్లో ఆలూరు ఎమ్మెల్యే, సీనియర్ మంత్రి గుమ్మనూరు జయరాంకు సిట్టింగ్ సీటు నుంచి పోటీచేసే అవకాశం దక్కట్లేదు. ఆలూరులో బరిలో దిగేందుకు వైసీపీ ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదు. అందుకు బదులుగా కర్నూలు పార్లమెంట్ ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు అప్పగించింది. ఎంపీగా పోటీలో దిగాలని సీఎం జగన్ ఆదేశించారు. అయితే జయరాం ఎంపీకి పోటీచేసేందుకు ఆసక్తికనబర్చలేదు. సరైన నిర్ణయం తీసుకునే క్రమంలో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఎట్టకేలకు బయటకొచ్చి పార్టీ మారుతున్నట్లు ప్రకటించారు.

మంత్రి గుమ్మనూరు జయరాం ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. మంత్రి పదవికి, వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. టీడీపీ తరుఫున గుంతకల్లు నుంచి బరిలో దిగుతున్నట్లు జయరాం తెలిపారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జయరాం.. ” సీఎం జగన్ విధానాలతో విసుగు చెందాను. కర్నూలు ఎంపీగా పోటీచేయాలని జగన్ అడిగారు. అది నాకు ఏమాత్రం ఇష్టం లేదు. టీడీపీ తరుఫున గుంతకల్లు నుంచి బరిలోకి దిగుతా. తాడేపల్లిలో ఇద్దరు పూజారులు ఉన్నారు. గుడిలో శిల్పం మాదిరిగా సీఎం జగన్ మారిపోయారు. సజ్జల రామకృష్ణా రెడ్డి, ధనుంజయ్ రెడ్డి చెప్పినట్లే ఆయన చేస్తున్నారు ” అంటూ ఆరోపణలు చేశారు.

కాగా.. ఇప్పటికే చంద్రబాబుతో గుమ్మనూరు జయరాం మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇవాళ సాయంత్రం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో పార్టీ కండువ మార్చుకోనున్నారు. ఇప్పటికే కర్నూలు నుంచి విజయవాడకు అనుచరులతో భారీ వాహనర్యాలీ తీశారు. బీసీ సామాజికి వర్గానికి చెందిన గుమ్మనూరు జయరాం రాయలసీమలో బలమైన నేతగా రాజకీయాల్లో రాణిస్తున్నారు. దీంతో టీడీపీ ఆయనకు సాదరస్వాగతం పలుకుతోంది.

READ LATEST TELUGU NEWS : వైసీపీకి ఒంగోలు ఎంపీ రాజీనామా

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS