Friday, December 20, 2024
HomeKonda Surekha In Vemulawada: వేములవాడ రాజన్న సన్నిధిలో మంత్రి కొండా సురేఖ

Konda Surekha In Vemulawada: వేములవాడ రాజన్న సన్నిధిలో మంత్రి కొండా సురేఖ

Konda Surekha In Vemulawada: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు దర్శించుకున్నారు.

స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కోడె మొక్కులు చెల్లించుకున్నారు. మంత్రి వెంట స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఉన్నారు.

తెలంగాణలోనే అతి పెద్ద శైవ క్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ తెలిపారు.

గత ప్రభుత్వంలో దేవాదాయ శాఖలో చాలా అవినీతి, అక్రమాలు జరిగాయన్నారు. రాష్ట్రంలోని ఆలయాలకు చెందిన దేవుడి మాన్యం భూములపై విచారణకు ఆదేశించినట్లు మంత్రి కొండా సురేఖ చెప్పారు.

Read Also: ఉజ్జయిని మహంకాళి గర్భగుడిలో అగ్నిప్రమాదం

ఆలయ భూములను రక్షించి దేవాలయం పేరు మీదనే పట్టా పాసు పుస్తకాలు ఇచ్చేవిధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

గుడి అభివృద్ధి కోసం దాతలు ఇచ్చే విరాళాలు నేరుగా ఆలయ ఖాతాకు చేరే విధంగా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు వివరించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో దేవాలయాల అభివృద్ధి కోసం అన్నివిధాలా కృషి చేస్తామని స్పష్టం కొండా సురేఖ(Konda Surekha In Vemulawada) చేశారు.

Minister Konda Surekha In Vemulawada Rajarajeshwara Swami Temple to offer prayers with family

READ LATEST TELUGU NEWS:  కాకతీయుల కట్టడానికి పునర్వైభవం    

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS