Sunday, December 22, 2024
Homenewsఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాం: మంత్రి శ్రీధర్ బాబు

ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాం: మంత్రి శ్రీధర్ బాబు

 

BY చీరాల ఇజ్రాయేల్ యాదవ్

తెలంగాణ, హైదరాబాద్. డిసెంబర్ 8 (వర్డ్ ఆఫ్ ఇండియా)

మన రాష్ట్రంలో మార్పు కావాలి, మార్పు కోరుకునే వారికి రాబోయే ఐదేళ్లలో మంచి ప్రగతితో తెలంగాణలో మార్పు చూపిస్తాం. ఎన్నికల్లో మేము ఇచ్చిన హామీల నెరవేర్పులో భాగంగా, ముందు ముందు మేము చేయబోయే భాగంగా ఈ క్రింది విషయాలపై చర్చించడం జరిగింది. వాటిలో ఖర్చుల గురించి శ్వేత పత్రం రిలీజ్ చేస్తాం. రాష్ట్ర ఆర్దిక పరిస్థితి పై వివరాలతో కూడిన అన్నీ అంశాలు తెలపాలని అధికారులను ఆదేశించాము. ఆరు గ్యారెంటీల గురించి తెలంగాణ ప్రజలకు ముందే తెలిపాము.

సోనియా మాట మేరకు ఈ గ్యారెంటీ లను అమలు చేస్తాం.
అన్నీ గ్యారెంటీలపై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది.
రెండు గ్యారెంటీలను మొదట అమలు చేస్తాం.
రేపు రెండు డిపార్ట్మెంట్ లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చిస్తారు.
సోనియా పుట్టినరోజు సందర్భంగా రెండు గ్యారంటీలను అమలు చేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

ప్రణాళికలు లెకుండా విద్యుత్ కొనుగోలు జరిగింది.
విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి విద్యుత్ అంతరాయం జరుగకుండా వ్యవసా వ్యవసాయానికి ఉచిత విద్యుత్, గృహ అవసరాలకు 200 యూనిట్ల విద్యుత్ ఇస్తాం.
9వ తేదీ ప్రొటెమ్ స్పీకర్ ను గవర్నర్ అపాయింట్ చేసిన తర్వాత స్పీకర్ ఎన్నిక, గవర్నర్ అడ్రెస్ ఉంటుంది.

తెలంగాణా రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు రవాణా, రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిమితిని 10లక్షలకు పెంపుతో పాటు పలు గ్యారెంటీలు డిసెంబర్ 9 నుంచి అమలు చేస్తాం అని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని
రైతుబంధుపై కూడా చర్చించి,మంత్రులు, అధికారులు క్షేత్ర స్థాయి పరిశీలన చేస్తామన్నారు.

ఆర్థిక శాఖ అధికారులు పూర్తి వివరాలు ఇచ్చిన తర్వాత రైతు బంధు పై ముందుకు వెళతాం అన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి, హామీల అమలు పై ఎలా ముందుకు వెళ్ళాలి అనేది దానిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS