ధోని ఐపీఎల్ ప్రాక్టీస్ షురూ.. బ్యాట్ ఏ బ్రాండో తెలుసా?
– By CORRESPONDENT
ఇండియన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) తన కెరీర్‌లో చివరి ఐపీఎల్ (IPL 2024) ఆడబోతున్నాడు. టోర్నీకి ఇంకా నెల రోజులే ఉంది. దీంతో తలైవా నెట్స్‌లో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. రాంచీ మైదానంలో మహీ భాయ్ ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
అయితే తన చివరి ఐపీఎల్ టోర్నీ కోసం ధోని కొత్త బ్యాట్ పట్టాడు. ఇంతకీ ఆ బ్యాట్ ఏ బ్రాండ్ అబ్బా అని ఆలోచిస్తున్నారా?. అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్‌ని పక్కనబెట్టి తన స్నేహితుడి షాప్ నుంచి ధోని ఓ బ్యాట్ తెచ్చుకున్నాడు. ప్రైమ్ స్పోర్ట్స్ అనే స్టిక్కర్ ఉన్న ఆ బ్యాట్‌తోనే తన చివరి ఐపీఎల్ ఆడనున్నాడని సమాచారం. బాల్య మిత్రుడి వ్యాపారాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే తలైవా ఈ నిర్ణయం తీసుకున్నాడట.
Dhoni has "Prime Sports" sticker on his bat
Prime Sports is the name of the shop of his childhood friend . pic.twitter.com/RsaGiDLi7a
— Don Cricket 🏏 (@doncricket_) February 7, 2024
ధోని చిన్నప్పటి మిత్రుడు పరంజిత్ సింగ్‌కు రాంచీలో ప్రైమ్ స్పోర్ట్స్ అనే షాపు ఉంది. మహీ కెరీర్ ప్రారంభంలో ఆయనకు పరంజిత్ ఎన్నోరకాలుగా సాయం చేశాడు. ధోని మొదటి బ్యాట్ అందించిన స్పానర్స్‌ను పట్టుకోవడంలో పరంజిత్‌ది కీలకపాత్ర. ఈ సన్నివేశం MS Dhoni: The Untold Story మూవీలో కూడా చూపించారు. దీంతో తన బాల్య స్నేహితుడి బిజినెస్ ఊపందుకోవాలనే తలైవా ఈ పని చేశాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ధోని భాయ్ రూటే సెపరేట్.. అందుకే ఆయన సో స్పెషల్ అంటూ ఫోటోలు షేర్ చేస్తున్నారు.
ఐపీఎల్‌లో తనదైన ముద్ర వేసిన ధోనీ భాయ్.. 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. IPL 2023లో జరిగిన 16వ సీజన్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ జట్టును విజేతగా నిలిపాడు. ఐదోసారి ఐపీఎల్ కప్ కొట్టి తన సత్తా ఏంటో మరోసారి ప్రపంచానికి నిరూపించాడు.. ఈ కెప్టెన్ కూల్. 41 ఏళ్ల వయసులోనూ ఫుల్ ఫిట్‌నెస్‌తో ఉన్న ధోని.. 17వ సీజన్‌ను విజయవంతంగా ముగించి ఐపీఎల్‌కు వీడ్కోలు పలకాలని భావిస్తున్నాడు.
READ ALSO: సానియా మీర్జాతో షోయబ్ విడాకులు.. ఎందుకంటే?