బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసు(Rameshwaram Cafe Blast)లో అనుమానిత నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నిందితుడిని బళ్లారికి చెందిన షబ్బీర్‌గా ఎన్ఐఏ గుర్తించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
నిందితుడి షబ్బీర్‌ను అధికారులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం రామేశ్వరం కేఫ్‌లో మార్చి 1న బాంబు బ్లాస్ట్(Rameshwaram Cafe Blast) జరిగిన విషయం తెలిసిందే. ఈ పేలుడులో మొత్తం 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.