ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. వైస్సార్ కాంగ్రెస్ తరఫు నుంచి వంగ గీత బరిలోకి దిగనున్నారు. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వంగ గీతకు మద్దతుగా మరో ముగ్గురు స్టార్ క్యాంపెయినర్లను బరిలోకి దింపింది. కూటమి లేకపోయి ఉంటే పిఠాపురం నుంచి తెలుగు దేశం పార్టీ తరఫున ఎస్వీఎస్ఎన్ వర్మ బరిలోకి దిగేవారు. పవన్ పోటీ చేస్తుండడంతో వర్మకు షాక్ తగిలింది. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వర్మను పిలిచి బుజ్జగించారు. ఎమ్మెల్సీ కోటాలో మంచి పదవి ఇస్తానని చెప్పడంతో ఆయన పవన్‌కు మద్దతు తెలిపేందుకు ఒప్పుకున్నారు. పవన్‌కు లక్ష ఓట్ల మెజారిటీ వచ్చేలా తెలుగు దేశం, జనసేన కార్యకర్తలు పిఠాపురంలో ప్రచారం చేస్తున్నారు. అయితే ఇప్పుడు వంగ గీత కోసం రంగంలోకి దింపిన స్టార్ క్యాంపెయినర్లు ఎవరి దారి వారు చూసుకున్నట్లు తెలుస్తోంది. దాంతో వంగ గీత ఒంటరిగా పిఠాపురంలో ప్రచారం చేస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ గ్రాఫ్ పిఠాపురంలో అమాంతం పెరిగిపోతుండడంతో వంగ గీత టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది.