పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రజాశాంతి పార్టీ (Praja Shanti Party) అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ (KA Paul) స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మా ట్లాడారు. ‘వరంగల్ లోక్ సభ సెగ్మెంట్ నుంచి బాబూమోహన్ పోటీ చేయనున్నారు. ఏపీలో ఎవరితో పొత్తు లేకుండా అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం. వైజాగ్ పార్లమెంట్ స్థానం నుంచి నేను బరిలోకి దిగుతున్నాను’ అని కేఏ. పాల్ వెల్లడించారు.
అనంతరం ప్రముఖ నటుడు, రాజకీయ నేత బాబు మోహన్(Babu Mohan) మాట్లాడుతూ ‘ బీజేపీ నన్ను గత ఐదేండ్లుగా వెట్టిచాకిరి చేయించుకుని వాడుకుంది. వరంగల్ స్థానానికి ఎంపీ టికెట్ ఇస్తానని చెప్పి.. లిస్టులో నా పేరు లేకుండానే లక్ష్మణ్.. బీజేపీ అధిష్ఠానానికి పంపారు. దేశం బాగుపడాలని నిరంతరం ప్రజాసేవలో ఉంటున్న కేఏ పాల్‌తో కలిసి పనిచేయాలని ప్రజాశాంతి పార్టీలో చేరాను. పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించి కేఏ పాల్(KA Paul) సేవలు దేశానికి, రాష్ట్రానికి అందే విధంగా కృషి చేస్తాను. మోడీ ప్రభుత్వం వచ్చినాక దేశాన్ని అప్పుల ఊబిలో ముంచేశారని’ ఆవేదన వ్యక్తం చేశారు.
READ LATEST TELUGU NEWS : సీపీఐకి ఒక్క ఎంపీ సీటైనా కేటాయించండి