Tuesday, April 22, 2025
Homenewsతెలంగాణ హైకోర్టు అదనపు అడ్వకేట్ జనరల్‌గా రజనీకాంత్ రెడ్డి

తెలంగాణ హైకోర్టు అదనపు అడ్వకేట్ జనరల్‌గా రజనీకాంత్ రెడ్డి

హైకోర్టు అదనపు అడ్వకేట్ జనరల్‌గా రజనీకాంత్ రెడ్డి

-BY చీరాల ఇజ్రాయేల్ యాదవ్

వర్డ్ ఆఫ్ ఇండియా

తెలంగాణ హైకోర్టు అదనపు అడ్వకేట్ జనరల్‌గా తేరా రజనీకాంత్‌ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి ఆర్. తిరుపతి పేరుతో జీవ్ జారీ చేశారు. రజనీకాంత్ బాధ్యతల అనంతరం ఆ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. రజనీకాంత్ రెడ్డి 15 ఏళ్లకు పైగా హైకోర్టులో అడ్వకేట్‌గా సేవలందిస్తున్నారు. దాదాపు 700 సివిల్, క్రిమినల్ కేసులు ఆయన వాదించినట్లు సమచారం.

రజనీకాంత్ రెడ్డి గతంలో హెదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ శాఖలో పనిచేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా 2005 నుంచి 2009 వరకు సేవలందించారు. అడ్వకేట్ జనరల్‌గా రజనీకాంత్ ప్రభుత్వంలో క్రియాశీలక పాత్ర పోషించనున్నారు. ప్రభుత్వానికి న్యాయస్థానంలో వెన్నుదన్నుగా నిలబడే వ్యక్తి అడ్వకేట్ జనరల్. కీలక కేసులు న్యాయస్థానం ముందుకు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరుఫున గట్టిగా వాదనలు వినిపించాల్సిన బాధ్యత ఆయనపై ఉంటుంది. అందుకే ఈ నియామకం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎట్టకేలకు అదనపు అడ్వకేట్ జనరల్‌గా రజనీకాంత్ రెడ్డిని నియమించి ప్రభుత్వం ఊహాలకు తెరదించింది.

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS