Friday, January 16, 2026
HomenewsRazakar Review: రజాకార్ చూసి యాంకర్ సుమ ఎమోషనల్

Razakar Review: రజాకార్ చూసి యాంకర్ సుమ ఎమోషనల్

ఈ నెల 15వ తేదీన‌ విడుద‌లైన ‘రజాకార్’ మూవీ పాజిటివ్ టాక్‌(Razakar Review)తో దూసుకెళ్తోంది. ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు యాటా సత్యనారాయణ యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించాడు.

గూడూరు నారాయణ నిర్మించిన ఈ చిత్రంలో బాబీసింహా, అనసూయ, రాజ్ అర్జున్, మార్కండ్ దేశ్‌పాండే, ఇంద్రజ, తేజ్ సప్రు, ప్రేమ‌, తలైవాస్ విజయ్ కీల‌క‌ పాత్రల్లో నటించారు. ఇక ఈ మూవీ చూసిన ప్రేక్షకులు ఇంతటి దారుణాలు జరిగాయా? అని చరిత్రను తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు.

అప్పట్లో ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో రజాకార్ మూవీలో చూసి చలించిపోతున్నారు. తాజాగా ‘రజాకార్’ సినిమా చూసిన యాంక‌ర్ సుమ క‌న‌కాల కూడా సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించింది. ఈ సంద‌ర్భంగా ఆమె చేసిన ఎమోష‌న‌ల్ ట్వీట్ ఇప్పుడు వైర‌ల్ అవుతోంది.

“కొద్దిసేప‌టి క్రిత‌మే ‘రజాకార్’ (Razakar Review) మూవీ చూశాను. ఆ సంఘ‌ట‌న‌లు, హైద‌రాబాద్ సంస్థానం స్వాతంత్య్రం కోసం చేసిన పోరాటాన్ని చూసి గుండె ప‌గిలిపోయేలా ఉంది. ఇందులో ఈ సంఘ‌ట‌న‌లు కళ్లకు క‌ట్టిన‌ట్లుగా చూపించినందుకు ద‌ర్శ‌కుడికి ధ‌న్య‌వాదాలు. అన‌సూయ‌, ప్రేమ‌, ఇంద్ర‌జ‌, బాబీ సింహా ఇలా న‌టులంద‌రూ త‌మ పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. చాలా బాగా న‌టించారు సింప్లీ సూప‌ర్బ్” అని త‌న ట్వీట్‌లో యాంకర్ సుమ పేర్కొంది. ప్ర‌స్తుతం సుమ ట్వీట్ వైర‌ల్ అవుతుండ‌గా, దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు.

READ LATEST TELUGU NEWS: 31 కిలోలు బరువు తగ్గిన మలయాళ హీరో పృథ్వీరాజ్

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS