Friday, December 20, 2024
HomeThousand Pillar Temple: కాకతీయుల కట్టడానికి పునర్వైభవం

Thousand Pillar Temple: కాకతీయుల కట్టడానికి పునర్వైభవం

కాకతీయుల కళా వైభవానికి ప్రతీకగా నిలిచిన వెయ్యిస్తంభాల గుడి (Thousand Pillar Temple) పునరుద్ధరణ పూర్తైంది. వరంగల్‌లోని ఈ దేవాలయాన్ని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి.. శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులకు అంకితం చేయనున్నారు.

వివిధ కారణాలతో ధ్వంసమైన వెయ్యిస్తంభాల గుడి (Thousand Pillar Temple) గత 40 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోలేదు. కేంద్ర సాంస్కృతిక మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కిషన్ రెడ్డి దీనిపై ప్రత్యేక చొరవతీసుకున్నారు. రాష్ట్రంలో సాంస్కృతిక, పర్యాటక కేంద్రాలకు ప్రాధాన్యత కల్పిస్తూనే.. వెయ్యిస్తంభాల గుడి పునరుద్ధరణకు కృషిచేశారు.

18 ఏళ్లుగా వెయ్యి స్తంభాల గుడికి పునరుద్ధరణ పనులు జరిగాయి. గత రెండేళ్లుగా మంత్రి కిషన్ రెడ్డి అధికారులతో సమీక్షిస్తూ పనులు వేగవంతమయ్యేలా కృషి చేశారు. ఎట్టకేలకు కాకతీయుల కాలం నాటి కట్టడానికి పూర్వవైభవం వచ్చింది. ఈ వెయ్యి స్తంభాల గుడిని శివరాత్రి సందర్భంగా శుక్రవారం అట్టహాసంగా ప్రారంభించనున్నారు.

READ LATEST TELUGU NEWS : వేములవాడలో అట్టహాసంగా శివరాత్రి మహోత్సవం

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS