పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ యాక్షన్ చిత్రం ‘సలార్’. ఈ సినిమాలో వరద రాజమన్నార్ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు పృథ్వీరాజ్ సుకుమారన్(PrithviRaj Sukumaran).
తెలుగులో కూడా పృథ్వీరాజ్ సుకుమారన్(PrithviRaj Sukumaran)కు మంచి ఫాలోయింగ్ వచ్చింది. కాగా ఆయన ప్రధాన పాత్రలో నటించిన మలయాళ చిత్రం ‘ద గోట్ లైఫ్’ తెలుగులో ‘ఆడుజీవితం’ పేరుతో త్వరలో రిలీజ్ కాబోతుంది.
బతుకుదెరువు కోసం కేరళ నుంచి సౌదీకి వెళ్లిన నజీబ్ అనే వ్యక్తి జీవిత కథ ఆధారంగా బ్లెస్సీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ‘దిగోట్ లైఫ్’ పేరుతో ఇంగ్లీష్‌లోను రిలీజ్ కాబోతుంది.
ఈ చిత్రం మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పృథ్వీరాజ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో నా పాత్ర కోసం 31 కిలోలు బరువు తగ్గాను. ఈ సినిమా కోసం మేమందరం చాలా కష్టపడ్డాం’ అని చెప్పాడు. ఆయన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
READ LATEST TELUGU NEWS: ముంబైలో 120 అడుగుల ప్రభాస్ ఫ్లెక్సీ