సంగీత ప్రపంచంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే గ్రామీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం అమెరికాలో అట్టహాసంగా జరిగింది. ఆదివారం రాత్రి లాస్ ఏంజిల్స్‌లో జరిగిన ఈ వేడుకల్లో ప్రపంచ దేశాలకు చెందిన సెలబ్రిటీలు పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు. ఈ ప్రతిష్ఠాత్మక మ్యూజిక్ కార్యక్రమానికి పాపులర్ సింగర్ ట్రెవర్ నోహ్ వ్యాఖ్యతగా వ్యవహరించారు. ఈ అంతర్జాతీయ వేదికపై భారతీయ సంగీత బృందం జయకేతనం ఎగురవేసింది. ఇండియన్ సంగీత కళాకారులు శంకర్ మహదేవన్, జాకీర్ హుస్సేన్‌లు సత్తా చాటారు.
66వ గ్రామీ అవార్డుల ప్రదానోత్సవంలో భారతీయ సంగీత కళాకారులు శంకర్ మహదేవన్, జాకీర్ హుస్సేన్‌లు కంపోజ్ చేసిన.. ‘దిస్ మూమెంట్’ అనే ఆల్బమ్‌ను అవార్డు వరించింది. 8 మంది శక్తి అనే బ్యాండ్ పేరుతో కలిసి క్రియేట్ చేసిన ఈ సంగీతానికి బెస్ట్ గ్లోబల్ ఆల్బమ్ అవార్డు దక్కింది.
Congrats Best Global Music Album winner – 'This Moment' Shakti. #GRAMMYs 🎶
WATCH NOW https://t.co/OuKk34kvdu pic.twitter.com/N7vXftfaDy
— Recording Academy / GRAMMYs (@RecordingAcad) February 4, 2024
దిస్ మూమెంట్ అనే ఆల్బమ్ 2023 జూన్ 23న శక్తి బ్యాండ్ ఆధ్వర్యంలో విడుదలైంది. 1973లో శక్తి బ్యాండ్ స్థాపించగా 1978 వరకు కార్యాకలాపాలు సాగించింది. అనంతరం మళ్లీ 2020లో మ్యూజిక్ షోలు ప్రారంభించింది. వారి 50 ఏళ్ల శ్రమకు దక్కిన ఫలితంగా గ్రామీ తమకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిందని బ్యాండ్ సభ్యులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అవార్డు తీసుకున్న అనంతరం శంకర్ మహాదేవన్ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. తనకు ప్రతి విషయంలో ఎంతో ప్రోత్సాహం అందించిన ఆయన భార్యకు ఈ గ్రామీ అవార్డును అంకితమిస్తునట్లు ప్రకటించారు. ఇందుకోసం సహకరించిన ప్రతిఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.
శక్తి బ్యాండ్‌లో జాకీర్ హుస్సేన్ తబలా వాయించగా.. శంకర్ మహాదేవన్ గాత్రం అందించారు. వి. సెల్వగనేశ్ పెర్కషనిస్ట్‌గా పనిచేశారు. జాన్ మెక్ లాగ్లిన్ గిటార్ ప్లే చేయగా.. గనేశ్ రాజాగోపాలనన్ వయోలిన్ వాయించి అద్భుతమైన మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఇక జాకీర్ హుస్సేన్ మరో గ్రామీ అవార్డును కూడా అందుకోవడం విశేషం. బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ కేటగిరీలో ‘పాస్తో’ అనే ఆల్బమ్‌కు ఆయనను గ్రామీ వరించింది. ఈ ఆల్బమ్ కోసం పనిచేసిన బెలా ఫ్లెక్, ఎడ్గర్ మేయర్, రాకేశ్ చౌరాసియాతో కలిసి జాకీర్ హుస్సేన్ ఈ గ్రామీ అవార్డును అందుకున్నారు.
Heartiest Congratulations to Shankar Mahadevan and the band “𝐒𝐡𝐚𝐤𝐭𝐢", which includes John McLaughlin, Ustad Zakir Hussain, Shankar Mahadevan, V Selvaganesh & Ganesh Rajagopalan on winning the Grammy award in the Best Global Music Album category for "𝐓𝐡𝐢𝐬… pic.twitter.com/d2s5X1fQFb
— Vijay Darda (@vijayjdarda) February 5, 2024
మొత్తంగా 66వ గ్రామీ అవార్డుల వేడుకలో ఆరుగురు భారతీయులు గ్రామీ అవార్డులు అందుకోవడం మరో విశేషం. శంకర్ మహాదేవన్‌కు 1, రాకేశ్ చౌరాసియాకు 2, జాకీర్ హుస్సేన్‌కు 3 గ్రామీ అవార్డులు దక్కించుకుని భారతీయ సత్తా చాటారు.
66వ గ్రామీ అవార్డులు 2024 విజేతలు వీరే
ఉత్తమ ర్యాప్ ఆల్బమ్ – మైఖేల్ (కిల్లర్ మైక్)
ఉత్తమ ఆఫ్రికన్ సంగీత ప్రదర్శన – టైలా (వాటర్)
మ్యాజిక్ వీడియో – జోనథన్ క్లైడ్ ఎమ్ కూపర్ (ఐయామ్ ఓన్లీ స్లీపింగ్)
గ్లోబల్ మ్యూజిక్ ప్రదర్శన – జాకిర్ హుస్సేన్, బెలా ఫెక్ (పష్టో)
గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ – శక్తి (దిస్ మూమెంట్)
ఉత్తమ బ్లూగ్రాస్ ఆల్బమ్ – మొల్లీ టర్టల్ & గోల్డెన్ హైవే – సిటీ ఆఫ్ గోల్డ్
ఉత్తమ కంటెంపరరీ ఇన్‌స్ట్రుమెంటల్ ఆల్బమ్ – బెలా ఫెక్, జాకిర్ హుస్సేన్, ఎడ్గార్ మెయర్, ఫీచరింగ్ రాకేష్ చౌరాసియా – ఆస్ వీ స్పీక్
ఉత్తమ జాజ్ ఇన్‌స్ట్రుమెంటల్ ఆల్బమ్ – బిల్లీ చైల్డ్స్ – ద విండ్స్ ఆఫ్ చేంజ్
ఉత్తమ కంట్రీ సోలో ప్రదర్శన క్రిస్ స్టేప్లెటన్ – (వైట్ హార్స్)
ఉత్తమ కంట్రీ సాంగ్ క్రిస్ స్టేప్లెటన్ – (వైట్ హార్స్)
ఉత్తమ కామెడీ ఆల్బమ్ – డేవ్ చాపెల్ – (వాట్స్ ఇన్ ఎ నేమ్)?
ఉత్తమ మ్యూజికల్ థియేటర్ ఆల్బమ్ – సమ్ లైక్ ఇట్ హాట్
ఉత్తమ రాక్ ఆల్బమ్ – పారామోర్ – దిస్ ఇజ్ వై
ఉత్తమ రాక్ సాంగ్ బాయ్‌జెనియస్ – నాట్ స్ట్రాంగ్ ఎనఫ్
ఉత్తమ మెటల్ ప్రదర్శన – మెటాలికా – 72 సీజన్స్
ఉత్తమ రాక్ ప్రదర్శన బాయ్‌జెనియస్ – నాట్ స్ట్రాంగ్ ఎనఫ్
READ AlSO: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్‌కు భారతరత్న కష్టమేనా?