Thursday, October 17, 2024
Homeతెలుగుఆంధ్రప్రదేశ్Pithapuram: పవన్ కల్యాణ్ తప్పుకుంటే పిఠాపురం నాదే- వర్మ కీలక వ్యాఖ్యలు

Pithapuram: పవన్ కల్యాణ్ తప్పుకుంటే పిఠాపురం నాదే- వర్మ కీలక వ్యాఖ్యలు

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసారు తెలుగు దేశం పార్టీ నేత ఎస్వీఎస్ఎన్ వ‌ర్మ‌. తెలుగు దేశం పార్టీకి జ‌న‌సేన‌తో పొత్తు లేక‌పోయి ఉంటే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వ‌ర్మ పిఠాపురం(Pithapuram) నుంచి పోటీ చేసేవారు.

అయితే ఇప్పుడు పిఠాపురం(Pithapuram) నుంచి ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోటీ చేస్తున్నారు. ఎలాగైనా త‌న‌ను ల‌క్ష మెజారిటీతో పిఠాపురంలో గెలిపించాల‌ని ప‌వ‌న్ కార్య‌క‌ర్త‌ల‌ను కోరారు. ఈ నేప‌థ్యంలో. పిఠాపురంలోని జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు ప‌వ‌న్‌ను గెలిపించేందుకు కృషి చేస్తున్నారు.

పవన్ కల్యాణ్ బ్యాన‌ర్లు, ఫ్లెక్సీలు, పార్టీ జెండాలు పిఠాపురం నియోజకవర్గ పరిధిలో క‌ట్టి పెద్ద స్థాయిలో ప్ర‌చారం చేసేందుకు సిద్ధం అయ్యారు. దీనిపై అక్కసు వెళ‌గ‌క్కుతున్నారు టీడీపీ నేత వ‌ర్మ‌.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌మ‌ను అడుక్కుంటే పిఠాపురం(Pithapuram) సీటు ఇచ్చామ‌ని.. పిఠాపురంలో తెలుగు దేశం పార్టీ వ‌ల్లే ప‌వ‌న్ గెలుస్తార‌ని షాకింగ్ కామెంట్స్ చేసారు. ఈ మాత్రం దానికి జ‌న‌సేన ఫ్లెక్సీలు క‌ట్టి ఆర్భాటం చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని పిఠాపురంలో తానే సేనాధిప‌తిని అంటూ జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌ను రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేసారు.

READ LATEST TELUGU NEWS: పవన్ పిఠాపురంలో గెలిస్తే ఏం జరగబోతుంది?

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS