అధికారంలోకి వస్తే.. వారికే ప్రాధాన్యం: టీడీపీ చీఫ్ చంద్రబాబు
-By CORRESPONDENT
టికెట్ రాలేదని నేతలు నిరుత్సాహపడొద్దని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పార్టీ నాయకులకు సూచించారు. పొత్తులు ఉన్నందున పార్టీ భవిష్యత్తు కోసం తీసుకునే నిర్ణయాలను గౌరవించాలని కోరారు. పొత్తులకు సహకరించిన నేతలకు టీడీపీ అధికారంలోకి రాగానే ప్రాధాన్యమిస్తామని హామీ ఇచ్చారు. పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం జరగదని స్పష్టం చేశారు.
టీడీపీ నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు శుక్రవారం టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడి నేతల్లో ధైర్యం నింపారు. జగన్‌తో విసిగిపోయిన వైసీపీ నాయకులు టీడీపీలోకి వస్తామంటున్నారని ఈ సందర్భంగా వెల్లడించారు. పార్టీకి పనికొచ్చె మంచి నేతలను మాత్రమే ఆహ్వానిస్తున్నామని స్పష్టం చేశారు. అలాంటి చేరికలకు నేతల మద్దతు ఉండాలని కోరారు. అటు ‘ రా కదలిరా ‘ సభలు ముగియగానే ప్రజా చైతన్య యాత్ర మొదలుపెడతామని చంద్రబాబు తెలిపారు.
50 రోజుల్లో ఎన్నికలు వస్తున్నందున టీడీపీ శ్రేణులు అహర్నిశలు పనిచేయాలని పిలుపునిచ్చారు. బీసీ సాధికార సభలను ప్రతీ నియోజకవర్గంలో నిర్వహించాలని ఆదేశించారు. బీసీల అభివృద్ధికి పాటుపడే పార్టీ టీడీపీ అని మరోసారి పేర్కొన్నారు.
జగన్ నీ సినిమా అయిపోయింది: చంద్రబాబు ట్వీట్
ఏపీ సీఎం వైయస్. జగన్‌పై టీడీపీ చీఫ్ చంద్రబాబు ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. జగన్ రెడ్డి నీ సినిమా అయిపోయిందంటూ ట్వీట్ చేశారు. “రాజధాని ఫైల్స్” సినిమాను ఆపేందుకు సీఎం జగన్ (CM YS Jagan) శతవిధాల ప్రయత్నించి విఫలమయ్యారని ఆరోపించారు. ప్రజలు ఈ సినిమా చూసి వాస్తవాలు తెలుసుకోవాలని కోరారు.
ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఒక ప్రాంతం పై కక్షగట్టి… అది కూడా రాష్ట్ర రాజధాని పై పగబట్టి సర్వనాశనం చేసిన ప్రాంతం అమరావతి. ఇది ఒక చారిత్రాత్మక విషాదం. దీని కోసం కులాల కుంపట్లు రాజేసాడు. విష ప్రచారాలు చేయించాడు. అధికార బలం మొత్తాన్ని ఉపయోగించి ఉద్యమకారులను చిత్రహింసలకు… pic.twitter.com/ZpAESYy3a1
— N Chandrababu Naidu (@ncbn) February 16, 2024
READ ALSO: ఎంపీగా పోటీ చేయనున్న కేటీఆర్?