Friday, December 20, 2024
HomeNara Lokesh: దేశం మంగళగిరివైపు చూసేలా చేస్తా: నారా లోకేష్

Nara Lokesh: దేశం మంగళగిరివైపు చూసేలా చేస్తా: నారా లోకేష్

మైనార్టీలను మోసం చేసింది జగన్ ప్రభుత్వమేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) అన్నారు. రాష్ట్ర చరిత్ర ఎప్పుడూ లేని విధంగా ముస్లింలపై దాడులు, మైనార్టీ సంక్షేమ కార్యక్రమాల రద్దు, వక్ఫ్ ఆస్తుల కబ్జాలు వైకాపా హయాంలో జరిగాయని లోకేష్ ఆరోపించారు.

మంగళగిరి రూరల్ మండలం బేతపూడి, నవులూరు, తాడేపల్లి డోలాస్ నగర్‌లలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన రచ్చబండ సభల్లో నారా లోకేశ్ పాల్గొన్నారు. మైనార్టీలకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసింది టిడిపి ప్రభుత్వం మాత్రమేనని లోకేష్ అన్నారు.

రంజాన్ తొఫా, ఇమామ్, మౌజం‌లకు గౌరవ వేతనం, మసీదుల మరమత్తుల కోసం నిధులు, పెళ్లి కానుక, విదేశీ విద్య, షాదిఖానాల నిర్మాణంలాంటి అనేక కార్యక్రమాలు చేపట్టింది టిడిపి ప్రభుత్వమని లోకేశ్ అన్నారు.

జగన్ హయాంలో వైసీపీ నాయకుల వేధింపులు తట్టుకోలేక ముస్లీం సోదరులు ఆత్మహత్యలు చేసుకున్నారని అబ్దుల్ సలామ్, మిస్బా ఘటనలు నారా లోకేష్(Nara Lokesh) గుర్తు చేశారు. టీడీపీ గెలిచిన వెంటనే జగన్ ఆపివేసిన మైనార్టీ సంక్షేమ కార్యక్రమాలు అన్ని తిరిగి ప్రారంభిస్తామని లోకేష్ అన్నారు.

మంగళగిరిలో రెండు సార్లు ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించారని.. మీ జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా? అంటూ నారా లోకేశ్(Nara Lokesh) ప్రశ్నించారు. 2నెలల క్రితం ఆర్కే వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటిస్తూ జగన్ మంగళగిరి నియోజకవర్గానికి ఇచ్చిన ఏ హామీ నిలబెట్టుకోలేదు, అందుకే పార్టీ మారుతున్నాని వెల్లడించారన్నారు.

కొండ, కాలువ పోరంబోకు, రైల్వే, అటవీ, దేవాదాయ భూముల్లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వారికి పట్టాలిస్తానని వైసీపీ ప్రభుత్వం నమ్మించిందని ఈ సందర్భంగా నారా లోకేశ్ అన్నారు. చేనేతలను ఆదుకుంటానని, మంగళగిరికి ప్రతి ఏడాది రూ.2వేల కోట్ల ప్రత్యేక నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తానన్నారని గుర్తుచేశారు.

అయితే.. ఈ హామీలన్నీ ఏమయ్యాయి? ప్రత్యేక నిధులు, ఇళ్ల పట్టాలు ఏమయ్యాయి? ప్యాకేజి కుదిరాక మళ్లీ వైసీపీలో చేరి జగనంతటోడు లేడంటున్నారని ఫైర్ అయ్యారు. అందుకే ఆయనకు కరకట్ట కమలహాసన్ అని పేరుపెట్టానని నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. అమరావతే రాజధానిగా ఉంటుందని చెప్పి, ఎన్నికల్లో గెలిచాక మూడు రాజధానులకు మొదట ఓటేసింది ఆర్కేనే. ఆయన మాటలు నమ్మి మంగళగిరి ప్రజలు మరోసారి మోసపోవద్దని కోరారు.

2014లో అమరావతి రాజధాని బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టే సమయంలో చిన్న రాష్ట్రం, ప్రాంతాల మధ్య విద్వేషాలు పెంచడం ఇష్టంలేదని, రాజధానికి కనీసం 30వేల ఎకరాలు కావాలని, అమరావతికి సంపూర్ణ మద్దతు పలుకుతున్నాని జగన్ చెప్పారని నారా లోకేశ్ అన్నారు.

గత ఎన్నికల్లో విజయం సాధించాక మాటతప్పి మడమతిప్పి 3 రాజధానుల నాటకానికి జగన్ తెరలేపారని నారా లోకేశ్ ఆరోపించారు. అమరావతి పూర్తై ఉంటే లక్షలాది మందికి ఉద్యోగాలు వచ్చేవని.. అయిదేళ్లలో ఏపీ ప్రభుత్వం ఒక్క పరిశ్రమను తీసుకురాలేదని ఆవేదన చెందారు.

రాష్ట్ర భవిష్యత్ కోసం అమరావతి రైతులు 33వేల ఎకరాలు త్యాగం చేశారని నారా లోకేశ్ పేర్కొ న్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక రాజధాని రైతులను అనేక విధాలుగా ఇబ్బంది పెట్టారన్నారు. పెయిడ్ ఆర్టిస్టులంటూ మహిళలను వేధించారని తెలిపారు.

శాసనమండలిలో కూడా టీడీపీ నేతల గొంతు నొక్కారని.. రెండునెలల్లో అమరావతిలో ఆగిపోయిన పనులు ప్రారంభిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. ఆగిపోయిన రాజధాని నిర్మాణపనులను పూర్తిచేసి తీరుతామని భరోసా ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్ కింద భూములిచ్చిన రైతులకు న్యాయంచేస్తామని నారా లోకేశ్(Nara Lokesh) అభయమిచ్చారు.

ఇంకా నారా లోకేశ్ ఏమన్నారంటే.. ” 2019లో 21 రోజుల ముందు మంగళగిరి నియోజకవర్గానికి వచ్చాను. అప్పుడు మీ సమస్యలు నాకు తెలియవు, నా గురించి మీకు తెలియదు. అయినా బేతపూడిలో నాకు మెజార్టీ ఇచ్చారు. మంగళగిరిలో నేను ఓడిపోయినప్పటికీ ఇక్కడి ప్రజల కోసం 29 సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టా. రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపిస్తే దేశం మొత్తం మంగళగిరివైపు చూసేలా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా.” అంటూ లోకేశ్(Nara Lokesh) హామీలు గుప్పించారు.

అటు ” భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను నిర్మిస్తాం. కాలువ, కొండ పోరంబోకు, దేవాదాయ, రైల్వే భూముల్లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వారికి ఇళ్ల స్థలాలను రెగ్యులరైజ్ చేసి పట్టాలిస్తాం. కృష్ణానది నుంచి పైప్ లైన్ వేసి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందిస్తాం. మంగళగిరి నియోజకవర్గంలో 20వేల ఇళ్లు కట్టించి ఇస్తాం.” అని నారా లోకేశ్(Nara Lokesh) తెలిపారు.

జగన్ రెడ్డి కటింగ్ అండ్ ఫిటింగ్ మాస్టరని.. పది రూపాయలు అకౌంట్‌లో వేసి, రెడ్ బటన్‌తో వంద లాగేసుకుంటున్నారని నారా లోకేశ్(Nara Lokesh) ఆరోపించారు. కరెంట్ ఛార్జీలు 9 సార్లు పెంచారని. ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచారని.. చెత్త పన్ను, ఇంటి పన్ను, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

పెళ్లి కానుక, అన్న క్యాంటీన్, చంద్రన్నబీమా, విదేశీ విద్య, ఫీజు రీయింబర్స్ మెంట్ లాంటి వంద పథకాలను వైసీపీ ప్రభుత్వం కట్ చేసిందని నారా లోకేశ్(Nara Lokesh) పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెంచిన కరెంట్ ఛార్జీలు, పన్నుల భారం తగ్గిస్తామన్నారు.

READ LATEST TELUGU NEWS: పవన్ పిఠాపురంలో గెలిస్తే ఏం జరగబోతుంది?

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS