Friday, December 20, 2024
HomeLok Sabha Elections 2024 : రాష్ట్రంలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది: కిషన్...

Lok Sabha Elections 2024 : రాష్ట్రంలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది: కిషన్ రెడ్డి

లోక్‌సభ ఎన్నికల్లో ( Lok Sabha Elections 2024 ) రాష్ట్రంలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ స్పష్టం చేశారు. ఈరోజు హోటల్ తాజ్ కృష్ణలో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీలో చేరికలు నిరంతర ప్రక్రియ అని, అవి కొనసాగుతూనే ఉంటాయని వెల్లడించారు.

లోక్‌సభ ఎన్నికలు ( Lok Sabha Elections 2024 ) నేపథ్లంలో ఇతర పార్టీల నేతలు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించామని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న 8 సీట్ల విషయంలో పార్టీ ఎన్నికల కమిటీతో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని అన్నారు. ఆదివారం ఢిల్లీ వెళ్తున్న తాను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో, ఇతర తర నేతలతో సమావేశమై ఈ అంశంపై చర్చిస్తామన్నారు.

READ LATEST TELUGU NEWS : మేం చెప్పనివి చేశాం.. మీరు చెప్పింది చేయండి: హరీశ్‌ రావు

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS