Mahalakshmi Scheme: ఆరు గ్యారంటీల హామీతో అధికారం చేజిక్కుంచుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. వాటి అమలుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది.ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభించింది. తాజాగా రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకానికి పచ్చజెండా ఊపింది. దీనికి సంబంధించిన జీవోను తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది. అటు 200 యూనిట్ల ఉచిత కరెంట్ (Free Power) పథకాన్ని కూడా ఈ పథకంతో పాటు ఫిబ్రవరి 27న అమల్లోకి తీసుకువచ్చింది.
Hon'ble CM Sri. A.Revanth Reddy will be Launching Mahalakshmi & Gruha Jyothi schemes at Secretariat https://t.co/W5DRskOXsw
— Telangana Congress (@INCTelangana) February 27, 2024
మహాలక్షి పథకానికి మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. వంట చేసే సమయంలో కట్టెలపొయ్యి పొగ నుంచి మహిళలకు విముక్తి కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొంది. తెలంగాణ మహిళల ఆరోగ్యం కాపాడటమే రూ.500కే గ్యాస్ సిలిండర్ ముఖ్యఉద్దేశమని స్పష్టం చేసింది.
ప్రజాపాలనకు దరఖాస్తు చేసుకున్నవారు రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకానికి అర్హులని ప్రభుత్వం తెలిపింది. లబ్ధిదారులు తెల్లరేషన్ కార్డు కలిగి ఉండాలని స్పష్టం చేసింది. ఇందుకోసం గడిచిన మూడేళ్లలో గ్యాస్ సిలిండర్ వినియోగదారుల లెక్కలపై దృష్టి సారించనుంది. కాగా తెలంగాణలో 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఆ వినియోగదారుల్లో 89.99 లక్షల మందికి రేషన్ కార్డులు ఉన్నాయి.
ఇక గ్యాస్ కంపెనీలకే డైరెక్టుగా ప్రతినెలా సబ్సిడీ చెల్లిస్తామని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. ఆ సబ్సిడీ మొత్తాన్ని గ్యాస్ కంపెనీలు వినియోగదారులకు బదిలీ చేస్తాయి. అంటే లబ్ధిదారులు పూర్తి ధరతో గ్యాస్ కొన్నతర్వాత.. రూ.500 పోను మిగిలిన డబ్బును 48 గంటల్లో గ్యాస్ కంపెనీలు వారి ఖాతాల్లో జమచేస్తారు. అందులో భాగంగా మూడేళ్ల సరాసరి వినియోగాదారుల సంఖ్య ఆధారంగా సిలిండర్లు అందించనున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అర్హుల జాబితాను ఆయా గ్యాస్ కంపెనీలకు ఇచ్చినట్లు సమాచారం.
అయితే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సచివాలయంలోనే ఈరోజు రెండు పథకాలను ప్రారంభించారు. మహాలక్ష్మి, గృహలక్షి పథకాలను మంత్రులతో కలిసి లాంఛనంగా అమల్లోకి తీసుకొచ్చారు.
READ ALSO: మహిళలకు వడ్డీ లేని రుణాలు.. ఉప ముఖ్యమంత్రి ప్రకటన