టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు 21 శాతం పీఆర్సీ (TSRTC PRC) ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ పీఆర్సీతో కూడిన వేతనాలు జూన్ ఒకటో తేదీ నుంచి అమలులోకి రానున్నాయి.
ఈ సందర్భంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) బస్ భవన్లో మీడియాతో మాట్లాడారు. టీఎస్ ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం కోసం భవిష్యత్‌లో మరిన్ని నిర్ణయాలు తీసుకోవాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. 2017లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 16 శాతం పీఆర్సీ ఇచ్చారని గుర్తుచేశారు. అప్పటి నుంచి మళ్లీ పీఆర్సీ ఇవ్వలేదన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగులకు పీఆర్సీ (TSRTC PRC) ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి వెల్లడించారు.
అందులో భాగంగానే ఉద్యోగులకు 21 శాతం పీఆర్సీ (TSRTC fitment) ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కొత్త విధానం పీఆర్సీ జూన్ ఒకటో తేదీ నుంచి అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. 2017 నుంచి 21 శాతం పీఆర్సీతో పే స్కేలు అమలు చేస్తామని తెలిపారు. ఈ విధానం వలన ఆర్టీసీపై నెలకు రూ.35 కోట్ల భారం పడనుందన్నారు. 53,071 మంది ఆర్టీసీ(TSRTC) ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనం చేకూరనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
READ LATEST TELUGU NEWS : అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు : సీఎం