రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న గిరిజన విశ్వ విద్యాలయం (Tribal University) ఏర్పాటు కోసం.. కేంద్రీయ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లుకు గతేడాది అక్టోబర్‌లో కేంద్రం ఆమోద ముద్ర వేసింది. గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలు, కళ జ్ఞాన అంశాల్లో బోధన, పరిశోధన సదుపాయాలకు ఈ విశ్వవిద్యాలయం వేదిక కానుంది.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేతుల మీదుగా ములుగులో శంకుస్థాపన జరుపుకున్న సమ్మక్క-సారలమ్మ గిరిజన వర్సిటీలో వచ్చే విద్యాసంవత్సరం నుంచే క్లాసులు ప్రారంభించనున్నారు.వచ్చే ఏడాది గిరిజన యూనివర్సిటీని (Tribal University) అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది.
దాదాపు రూ.900 కోట్లతో నిర్మిస్తున్న ఈ యూనివర్సిటీ నిర్మాణ కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి. మరోవైపు తాత్కాలిక భవనంలో.. క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని వచ్చే విద్యాసంవత్సరం నుంచే తరగతులు జరిగేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది.
అందులో భాగంగానే ఇప్పటికే.. తాత్కాలిక భవనంలో గిరిజన యూనివర్సిటీ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి OSDని కూడా నియమించారు. కొత్త క్యాంపస్ నిర్మాణ పనుల పరిశీలన కూడా ఈ తాత్కాలిక క్యాంపన్ నుంచే చేయనున్నారు. ఈ నేపథ్యంలో.. తాత్కాలిక భవనాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఇందుకోసం అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.
READ LATEST TELUGU NEWS :శివనామస్మరణతో మారుమోగుతున్న వేములవాడ