కర్ణాటక రాజధాని బెంగళూరు నగరం.. నీటి సమస్య(Water Problem)తో అల్లాడిపోతుండటం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే నీరు లేక బెంగళూరు నగరం పడుతున్న అవస్థలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరు గాంచిన బెంగళూరు నగరంలో.. దేశవ్యాప్తంగా ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ నీటి సమస్య(Water Problem) తలెత్తడంతో.. వర్క్ ఫ్రమ్ హోం చేస్తూ సొంత ఊర్లకు పయనం అవుతున్నారు.
ఈ క్రమంలోనే బెంగళూరును విడిచివెళ్లేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే ఈ నీటి సంక్షోభం(Water Problem) బెంగళూరు నగరంలోనే కాకుండా హైదరాబాద్ సహా దేశంలో ఉన్న మరో 30 నగరాలకు కూడా విస్తరించే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.
బెంగళూరు నగరానికి ప్రధాన నీటి వనరులైన భూగర్భ జలాలు, కావేరీ నదిలో నీరు అడుగంటిపోవడంతో నీటి సమస్య తలెత్తింది. దీంతో బెంగళూరు నగరంలో వేలాది బోర్లు ఎండిపోయాయి.
దీంతో నీరు దొరక్క జనం ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే నీటిని పొదుపు చేయాలని అధికారులు, ప్రభుత్వం, హౌసింగ్ సొసైటీలు నగరవాసులకు సూచనలు చేస్తున్నాయి.
ఈ క్రమంలోనే తాగు నీటిని వృథా చేస్తే కఠిన చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఇలా నీటిని వృథా చేసిన 22 కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.5000 చొప్పున రూ.1.1 లక్షల ఫైన్లను అధికారులు వసూలు చేశారు. అయితే రుతుపవనాలు వచ్చిన వర్షాలు పడేవరకు ఈ నీటి సమస్య కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇక బెంగళూరులో ఏర్పడిన నీటి సమస్య(Water Problem)ను చూసి దేశవ్యాప్తంగా తీవ్ర భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితి తమకు కూడా వస్తే ఎలా అని జనం భయపడుతున్నారు.
ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ సమస్య బెంగళూరులో ఉండగా.. రాబోయే కాలంలో హైదరాబాద్‌తోపాటు దేశంలోని మరో 30 నగరాలు నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
2030 నాటికి భారత దేశ జనాభాలో 40 శాతం మందికి తాగునీరు దొరకదని 2019 లోనే నీతిఆయోగ్ ఒక నివేదికలో వెల్లడించింది.
దేశంలోని ప్రధాన నగరాలైన బెంగళూరు, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, జైపూర్, బటిండా, లక్నో, చెన్నై సహా పలు నగరాలు తీవ్ర నీటి సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉందని నీతిఆయోగ్ తెలిపింది.
ఇక వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ 2020 నివేదిక ప్రకారం 2050 నాటికి దేశంలోని 30 నగరాలు నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటాయని ప్రమాద ఘంటికలు మోగాయి.
ఇందులో ఢిల్లీ, జైపూర్, ఇండోర్, అమృత్‌సర్, పూణె, శ్రీనగర్, కోల్‌కతా, బెంగళూరు, ముంబై, కోజికోడ్, వైజాగ్ ఉంటాయని సంస్థ తెలిపింది.
ఇక 2023 ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం.. భారతదేశంలోని సింధు-గంగా పరివాహక ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలు ఇప్పటికే భూగర్భ జలాల క్షీణతను ఎదుర్కొంటున్నాయని వెల్లడైంది. వాయువ్య ప్రాంతంలో 2025 నాటికి చాలా తక్కువ భూగర్భ జలాల లభ్యత తగ్గుతుందని చెప్పింది.
READ LATEST TELUGU NEWS: దేశం మంగళగిరివైపు చూసేలా చేస్తా: నారా లోకేష్