హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ‘కాళేశ్వరం ప్రాజెక్టు, బీఆర్ఎస్ అబద్ధాలు, కాగ్ చెప్పిన వా స్తవాలు’పై టీజేఎస్ ఆధ్వర్యంలో బహిరంగ చర్చ జరిగింది. ఈ సమావేశానికి టీజేఎస్ (TJS) రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం ( Kodandaram), రిటైర్డ్ ఐఏఎస్ ఆకుసూరి మురళి, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, పలువురు మేధావులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ముందు నుంచి ఎలాంటి ఉపయోగం తెలిసి కూడా మాజీ సీఎం కేసీఆర్ తప్పుడు నిర్ణయం తీసుకున్నారన్నారు. ఐక్యరాజ్య సమితికి పని చేసిన హనుమంతరావు సైతం ప్రాజెక్ట్ కట్టవద్దని చెప్పినా ఆయన వినలేదన్నారు. కాళేశ్వరం డిజైన్లు కూడా కాంట్రాక్టర్లకే అప్పగించారని ఆరోపించారు. ప్రాజెక్ట్ మెయింటెనెన్స్‌ని కాగ్ తప్పుబట్టిందని గుర్తుచేశారు.
ఇంకా.. ఖర్చులు పెరిగాయని కాంట్రాక్టర్లకు కేసీఆర్ అదనంగా డబ్బులు ఇచ్చారని టీజేఎస్ (TJS) రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం ఆరోపణ చేశారు. భూకంపాలు వచ్చే చోట మల్లన్న సాగర్ కట్టారని ఎద్దేవా చేశారు. మేడిగడ్డలో కుంగింది మూడు పిల్లర్లు మాత్రమే కాదని మూడు వ్యవస్థలు కుప్పకూలాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం లక్ష 87 వేల కోట్లు రూపాయల అప్పు చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా కుప్పకూల్చారన్నారు. ప్రాణహిత దగ్గర నీళ్లను వాడుకోవాల్సిందని కాగ్ చెప్పిందని వివరించారు. వెంటనే కాళేశ్వరంపై సమగ్రంగా విచారణ జరపాలని కోదండరామ్ డిమాండ్ చేశారు.
READ LATEST TELUGU NEWS : టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్