Thursday, October 17, 2024
Homeతెలుగుఆంధ్రప్రదేశ్రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ మృతి.. నిరసన కార్యక్రమానికి వెళ్తుండగా దుర్ఘటన

రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ మృతి.. నిరసన కార్యక్రమానికి వెళ్తుండగా దుర్ఘటన

కారు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతి

BY చీరాల ఇజ్రాయేల్ యాదవ్

వర్డ్ ఆఫ్ ఇండియా

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, యూటీఎఫ్ సీనియర్ లీడర్ షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. భీమవరంలో జరిగే అంగన్వాడీ కార్యకర్తల నిరసన కార్యక్రమానికి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండి మండలం చెరుకువాడ వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారును.. ఎదురుగా వస్తున్న మరో కారు ఢీకొట్టడంతో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భీమవరం నుంచి ఆకివీడు వెళ్తున్న ఆ కారు వేగంతో అదుపుతప్పి ఎమ్మెల్సీ కారును ఢీకొట్టింది. దీంతో షేక్ సాబ్జీ అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవర్, గన్‌మెన్, ఆయన పీఏలకు తీవ్రగాయాలయ్యాయి. వారిని అంబులెన్సులో హుటాహుటిన భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనాస్థలాన్ని ఉండి ఏఎస్సై సూర్యనారాయణతోపాటు ఇతర అధికారులు పరిశిలీంచారు.

కేబినెట్ సమావేశం జరుగుతున్న సమయంలోనే ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మరణవార్త తెలియడంతో సీఎంతో పాటు మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతూ.. రెండు నిమిషాలు మౌనం పాటించారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు.. ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. అంగన్వాడీల పోరాటానికి మద్దతు తెలిపిన పీడీఎఫ్ నేత మనల్ని విడిచి వెళ్లిపోవటం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ జీవిత ప్రస్థానం

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన షేక్ సాబ్జీ 1966లో ఏలూరులో జన్మించారు. మాదేపల్లిలోని ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంటుగా పనిచేశారు. ఐదేళ్ల సర్వీసు మిగిలి ఉండగానే రాజీనామా చేసి.. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. యూటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలందించారు. 2019లో సీపీఎస్ రద్దు కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఏలూరు నుంచి విజయవాడ వరకు తన నాయకత్వంలో పాదయాత్ర చేపట్టారు.

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS