దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరో రెండు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (VandeBharat Trains) రైళ్లు పట్టాలెక్కాయి. సికింద్రాబాద్-విశాఖ మధ్య ఇప్పటికే ఓ వందేభారత్ రైలు నడుస్తుండగా.. నేటి నుంచి మరొకటి అందుబాటులోకి వచ్చింది. ఈ రైలు ప్రతి రోజూ ఉదయం 5 గంటల 5 నిమిషాలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం ఒంటి గంటా 50 నిమిషాలకు విశాఖ చేరుకుంటుంది.
వీటితో పాటు దక్షిణమధ్య రైల్వే పరిధిలోని కొన్ని స్టేషన్లను కలుపుతూ కలబురగి-బెంగళూరు మార్గంలో కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభమమయింది. మొత్తం 10 వందేభారత్ రైళ్ల(VandeBharat Trains)ను ప్రధాని వర్చువల్‌గా ఈరోజు ప్రారంభించారు. దీంతో దేశంలో మొత్తం ఈ రైళ్ల సంఖ్య 50 దాటడం విశేషం.
అహ్మదాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో 85 వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులకు ప్రధాని మోడీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 9 పీఎం గతిశక్తి కార్గో టెర్మినళ్లు, 11 గూడ్స్ షెడ్లు, రెండు జన ఔషధి కేంద్రాలు, 3 రైల్వే కోచ్ రెస్టారంట్లను ప్రధాని మోడీ ప్రారంభించారు.
Two more new VandeBharat Trains Started between secunderabad and vishakapatnam
READ LATEST TELUGU NEWS: రైల్వే ప్రయాణికులకు కొత్త రూల్.. 10 నిమిషాల్లో రావాల్సిందే