ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు చెందిన డీప్ ఫేక్ వీడియో(UP CM Deep Fake) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డయాబెటిక్ ఔషధానికి ప్రచారం చేస్తున్నట్లు అందులో ఉంది. మధుమేహ బాధితులు ఔషధాన్నికొనుగోలు చేయాలంటూ ఆదిత్యనాథ్ ప్రోత్సహిస్తున్నట్లు ఈ వీడియోను తయారు చేశారు.
ఓ న్యూస్ ఛానల్ క్లిప్‌లో సీఎం యోగి ఆదిత్యనాథ్ (UP CM Deep Fake) మాట్లాడుతున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ప్రముఖ నటులు రష్మిక మందన్న, కత్రినా కైఫ్, కాజోల్, ఆలియా భట్ వంటి తదితర స్టార్‌లకు చెందిన డీప్ ఫేక్ వీడియోలు నెట్టింట్లో వైరలయిన విషయం తెలిసిందే.
READ LATEST TELUGU NEWS: కాంగ్రెస్ అభ్యర్థుల తొలిజాబితా విడుదల.. వయనాడ్ నుంచే రాహుల్