Water Problem : వేసవి తాపంతో భూగర్భ జలాలు అడుగంటుతున్న వేళ.. నగరవాసుల దాహార్తి తీర్చేందుకు మంచినీటి సరఫరా శాఖ పటిష్ట చర్యలు చేపడుతున్నది. సకాలంలో నీటి సరఫరా చేస్తూనే.. శివారు ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నది. గ్రేటర్ పరిధిలో సాగు నీటి సరఫరా తీరుపై ప్రత్యేక కథనం.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో.. అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా.. మహానగర మంచినీటి సరఫర శాఖ అన్ని చర్యలు తీసుకుంటోంది. శివారు ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తూ.. తాగునీటి ఇబ్బంది తలెత్తకుండా చూస్తోంది.
Supreme Court On Jagan Case: జగన్ అక్రమాస్తుల కేసుపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
వేసవి ప్రారంభానికి ముందు నుంచే ఎండలు పెరిగిపోవడంతో.. నగరంలో తాగునీటి ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. గత వర్షా కాలం ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాకపోవడంతో.. వేసవి ఆరంభంలోనే భూగర్భ జలాలు అడుగంటాయి. అయితే ఈ ప్రభావం నగర వాసులపై పడకుండా.. మంచినీటి సరఫరా శాఖ చర్యలు చేపట్టింది.
ఉస్మాన్ సాగర్, గండిపేట, ఎల్లంపల్లి, సింగూరు, కృష్ణ ప్రాజెక్టుల ద్వారా నగరానికి మంచి నీటి సరఫరా నిరంతరాయంగా సాగుతోందని మంచినీటి సరఫరా శాఖ అధికారులు తెలిపారు. గ్రేటర్ కు నీటిని అందించే జలాశయాల్లో నీటి నిల్వలు సరిపడ ఉన్నాయని పేర్కొన్నారు. నల్లాల ద్వారా అందించే సరఫరాలో ఎలాంటి కొరత లేదని వెల్లడించారు. కాగా.. బోర్లు ఎండిపోవడం ద్వారా ట్యాంకర్లకు డిమాండ్ పెరిగిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
పురపాలక ప్రత్యేక కార్యదర్శి దాన కిషోర్ అధికారులతో మహానగర మంచినీటి సరఫరాపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కూడా నీటి సరపరకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జరిచేశారు.