Thursday, October 17, 2024
HomeతెలుగురాజకీయంPawan In Pithapuram : పిఠాపురం రాజకీయాల్లో పవన్‌ వ్యూహం ఏంటి?

Pawan In Pithapuram : పిఠాపురం రాజకీయాల్లో పవన్‌ వ్యూహం ఏంటి?

పిఠాపురంలో పవన్‌ కల్యాణ్‌(Pawan In Pithapuram)కు అనేక సవాళ్లు ఎదురు కాబోతున్నాయి. వైసీపీ చేపట్టిన కౌంటర్‌ ఆపరేషన్‌తో కొత్త ప్రశ్నలు లేవనెత్తనున్నాయి. పిఠాపురంపైనే ముద్రగడతోపాటు వైసీపీ సీనియర్లు ఫోకస్‌ చేస్తున్నారు. అటు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ కామెంట్స్‌తో జనసేన క్యాడర్‌లో కలవరం మొదలైంది.

ఈ పరిణామాల నేపథ్యంలో గ్రామస్థాయిలో జనసైనికులకు వైసీపీ ఆకర్షణ వల వేస్తోంది. అటు అభ్యర్థిగా పవన్‌ కల్యాణ్‌ ఇంకా పిఠాపురంలో అడుగుపెట్టనే లేదు. ఈ నేపథ్యంలో గ్రామస్థాయిలోనూ పవన్‌ కల్యాణ్‌కు పొలిటికల్‌ ఛాలెంజెస్‌ ఎదురుకాబోతున్నాయి. దీంతో పిఠాపురంలో పవన్‌ కల్యాణ్‌ ఒంటరి పోరాటం చేయాల్సిందేనా?. ఈజీగా గెలుస్తాం అనే భ్రమ నుంచి పవన్‌ బయటపడాలా? అనే ప్రశ్నలు తలెత్తున్నాయి.

పిఠాపురంలో పోటీ చేస్తున్నట్టు పవన్‌ కల్యాణ్‌(Pawan In Pithapuram) ప్రకటించారు సరే.. అక్కడ జనసేనాని అనుకున్నట్టుగా పరిస్థితులు ఉన్నాయా? పిఠాపురంలో పవన్‌ కల్యాణ్‌కు ఎదురవుతున్న సవాళ్లేంటి?

వైసీపీ కౌంటర్‌ ఆపరేషన్‌.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ స్టేట్‌మెంట్లు.. జనసేనను నుంచి వలసలు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నాయి? ఇంతకీ పిఠాపురంలో గాజు గ్లాసు పగులుతుందా.. పగలకుండానే పదును తేలి ప్రత్యర్థులను రాజకీయంగా గాయపరుస్తుందా? అనే అంశాలు ఇక్కడ చర్చిద్దాం.

పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పొలిటికల్‌ హైప్‌ నెలకొంది. జనసేనాని పవన్‌ కల్యాణ్‌ పోటీ చేస్తుండటంతో.. అందరి దృష్టీ ఇక్కడే ఉంది. ఒక్క జనాలే కాదు.. ప్రధాన పార్టీల ఫోకస్‌ కూడా ఇక్కడే.

మూడు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న పవన్‌ కల్యాణ్‌ను ఓడించేందుకు వైసీపీ చేపట్టిన కౌంటర్‌ ఆపరేషన్‌ చాపకింద నీరులా సాగిపోతోంది. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2 లక్షల 30 వేల పైచిలుకే. వీరిలో కాపు సామాజికవర్గ ఓటర్లే 85 వేల 4వందలు. కాపు ఓటర్లు అత్యధికంగా ఉన్న సెగ్మెంట్‌ ఇది.

ఈ లెక్కలు చూసి.. పవన్‌ కల్యాణ్‌ గెలుపు నల్లేరుపై నడకే అన్నది అందరూ చెప్పేమాట. పైకి ఇలాంటి మాటలు బరిలో ఉన్నవారిని.. వారిని అభిమానించే వారిని సంతోష పెట్టొచ్చుకానీ.. గ్రౌండ్‌ లెవల్‌ రియాలిటీ తెలుసుకుంటే కళ్లు తేలేయక తప్పదు.

ఎందుకుంటే.. వైసీపీ అన్ని వైపుల నుంచి గ్రిల్ చేస్తోంది. కుప్పంలో చంద్రబాబు, మంగళగిరిలో నారా లోకేష్‌.. హిందూపురంలో నందమూరి బాలకృష్ణలను గురిపెట్టినట్టే.. పిఠాపురంలో పవన్‌ కల్యాణ్‌ లక్ష్యంగా కౌంటర్‌ ఆపరేషన్‌ మొదలుపెట్టింది అధికారపార్టీ.

అందుకే పిఠాపురంలో ఏం జరుగుతోంది? వైసీపీ ఏం చేస్తోంది? పవన్ కల్యాణ్‌కు ఎదురవుతున్న సవాళ్లేంటి? ఆ సవాళ్లను పవన్‌ కల్యాణ్ ఎలా ఎదుర్కొంటారు అనే ప్రశ్నలు బలంగా వినిపిస్తున్నాయి.

పిఠాపురంలో పోటీ చేస్తున్నట్టు పవన్‌ కల్యాణ్‌(Pawan In Pithapuram) ప్రకటించగానే తన అమ్ముల పొదిలోని కీలకమైన చతురంగ బలగాలను వైసీపీ ఫీల్డ్‌లోకి దించింది. వాటిని బ్రహ్మాస్త్రాలుగా భావిస్తోంది. మొదటి అస్త్రం కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం.

ఆయన వైసీపీలో చేరగానే పవన్‌ కల్యాణ్‌ లక్ష్యంగా కాపులను వైసీపీవైపు మళ్లించేందుకు పిఠాపురంలో పని మొదలుపెట్టేశారు. రహస్య సమావేశాలతో వేడెక్కిస్తున్నారు. పిఠాపురంలోని కాపు సంఘాల నేతలు.. కాపు ప్రముఖులతో ముద్రగడకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

పవన్‌ కల్యాణ్ గెలవాలని పిఠాపురం(Pawan In Pithapuram)లోని కాపులు మనసులో అనుకుంటున్నా.. ముద్రగడ పిలిస్తే మాత్రం వెంటనే సీక్రెట్ మీటింగ్స్‌కు వెళ్లిపోతున్నారు. రహస్య సమావేశాల్లో ఆయన చెప్పింది మొత్తం ఆలకిస్తున్నారు.

మరి.. ముద్రగడ చేస్తున్న బ్రెయిన్‌ వాష్‌ ఫలితం కనిపిస్తుందా అంటే.. పైకి ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఇదే విధంగా ఇక్కడి కాపులు.. మత్స్యకారులపై వైసీపీ వదిలిన మరో రెండు బాణాలు.. మాజీ మంత్రి కురసాల కన్నబాబు.. మంత్రి దాడిశెట్టి రాజా.

వీరికి మండలాల వారీగా బాధ్యతలు అప్పగించి.. వైసీపీకి క్షేత్రస్థాయిలో పట్టుసాధించే పనిలో ఉన్నారు. వైసీపీ పెద్దలు చెప్పారు కాబట్టి.. ఈ ఇద్దరు నేతలు వచ్చి మనస్ఫూర్తిగా పనిచేస్తున్నా.. వారి మాటలు లోకల్‌ ఓటర్లలో మార్పులు తెస్తున్నాయా? పవన్‌ కల్యాణ్‌ నుంచి ఓటర్ల మనసు మార్చగలుగుతున్నారా అనేది ప్రశ్న.

ఇక పిఠాపురం కేంద్రంగా భీకర ఆపరేషన్‌ చేపట్టారు ఎంపీ మిథున్‌రెడ్డి. ఓటర్లను మార్చేందుకు అన్నిరకాల అస్త్రాలను ప్రయోగిస్తున్నారట. ఆర్ధికంగా.. అంగబలం పరంగా అన్నీ సమకూర్చేందుకు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి కూడా కత్తులు నూరుతున్నారు. అసలే పవన్‌ కల్యాణ్, ద్వారంపూడి మధ్య ఉన్న రాజకీయ వైరం.. వ్యక్తిగత వైరంగా మారింది. దీంతో ద్వారంపూడి కసిగానే పిఠాపురంలో పనిచేస్తున్నట్టు చెబుతున్నారు.

పిఠాపురంలో రెండు మున్సిపాలిటీలు.. మూడు మండలాలు ఉన్నాయి. పిఠాపురం, గొల్లప్రోలు మున్సిపాలిటీలు కాగా.. పిఠాపురం, గొల్లప్రోలు, యు.కొత్తపల్లి మండలాలు కీలకం. పవన్‌కల్యాణ్‌ పోటీ అనగానే ఇక్కడి జనాలతోపాటు జనసైనికులు పాజిటివ్‌గా స్పందించారు.

కానీ.. ప్రత్యర్థిపార్టీ చేపట్టిన ఆపరేషన్‌ను అధిగమించాలంటే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌(Pawan In Pithapuram) ఇంకేదో ప్రయత్నం చేయాలన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తాను పోటీ చేస్తున్నాను అని ప్రకటించాక.. ఇంతవరకు పిఠాపురం వెళ్లలేదు పవన్‌ కల్యాణ్‌.

ఆయన ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నారు అక్కడి ప్రజలు. పిఠాపురంలో జనసేన ఎమ్మెల్యే అభ్యర్ధిగా పవన్‌ కల్యాణ్‌ (Pawan In Pithapuram)అడుగుపెడితే పొలిటికల్‌ సిచ్యువేషన్‌ ఎలా ఉంటుందో అంచనాకు రావొచ్చన్నది కొందరి వాదన. పవన్‌ కల్యాణ్‌ ఎన్నికల ప్రచారం.. గెలుపు బాధ్యతలను స్థానికంగా ఉన్న జనసైనికులు, టీడీపీ నేతలు.. బీజేపీ నాయకులు భుజాన వేసుకోవాలి.

అయితే టీడీపీ టికెట్‌ ఆశించిన మాజీ ఎమ్మెల్యే వర్మ వార్నింగ్‌ బెల్స్‌ మోగిస్తూనే ఉన్నారు. చంద్రబాబు మాట్లాడిన తర్వాత వర్మ నెమ్మదించినట్టు కనిపించినా.. అడపాదడపా ఆయన చేస్తున్న ప్రకటనలు.. ఆయనలో గూడుకట్టుకున్న అసంతృప్తిని బయటపెడుతోంది.

పోటీకి దూరంగా ఉండటాన్ని వర్మ సహించలేకపోతున్నారు. పోటీ చేయాల్సిందే అన్నది వర్మ అభిలాష. ఇప్పటికీ అదే మాటపై ఉన్నారు. పొత్తులో భాగంగా జనసేనకు వర్మ ఎంత వరకు సహకరిస్తారు అనేది ఒక డౌట్‌. టీడీపీ ఓట్లను పూర్తిస్థాయిలో జనసేనకు పడేలా చేయడం ఈ పరిస్థితుల్లో సవాలే.

ఇదే సమయంలో జనసేన నేతలను వైసీపీ వదలడం లేదు. 2019 ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసిన శేషుకుమారిని లాగేసుకుంది. మరికొందరు గ్రామ, మండలస్థాయి జనసేన నాయకులకు కూడా గాలం వేస్తోంది.

వీరివల్ల జనసేనకు పడే ఓట్లను చీల్చితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కష్టం. అందుకే ఇంటిపోరును.. పొత్తులో ఎదురవుతున్న సమస్యలను.. వైసీపీ ఎత్తుగడలను ఏకకాలంలో పవన్‌ కల్యాణ్‌ అధిగమించడం పెను సవాల్‌గానే భావించాలి.

పిఠాపురంలో పోటీ చేస్తే పవన్‌ కల్యాణ్(Pawan In Pithapuram) ఈజీగా గెలిచిపోతారు అనే భ్రమ నుంచి బయట పడి.. ఫీల్డ్‌ లెవల్లోని పరిస్థితులు ఆకలింపు చేసుకుని అనుకూలంగా మలుచుకోకపోతే ఇబ్బందే అన్నది ఇంకొందరి వాదన.

మరి.. ఈ విషయాలను పవన్‌ కల్యాణ్(Pawan In Pithapuram) గమనించారా? ఆయన దృష్టికి వెళ్లాయా? పిఠాపురం జనసైనికులు ఆ విషయాలను పవన్‌ కల్యాణ్‌ దృష్టిలో పెట్టారా? టీడీపీ, బీజేపీ నాయకులు గ్రహించి.. పవన్‌ కల్యాణ్‌కు మద్దతుగా నిలుస్తున్నారా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.

READ LATEST TELUGU NEWS: కాపు ఓటర్లు ఎవరికి మద్దతు ఇస్తారు?

 

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS