Monday, December 23, 2024
HomeCitizen Amendment Act: పౌరసత్వ సవరణ చట్టంతో ముస్లింలకు ప్రమాదమా ?

Citizen Amendment Act: పౌరసత్వ సవరణ చట్టంతో ముస్లింలకు ప్రమాదమా ?

దేశంలో పౌరసత్వ సవరణ చట్టం (Citizen Amendment Act) తక్షణమే అమల్లోకి వస్తుంది అంటూ కేంద్ర ప్రభుత్వం.. లోక్‌సభ ఎన్నికలకు ముందు సంచలన ప్రకటన చేసింది. దీనికి సంబంధించిన విధివిధానాలను అతి త్వరలోనే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆమోదించనుంది.

అయితే ఈ పౌరసత్వ సవరణ చట్టం 2019లోనే పార్లమెంటు ఆమోదం పొందినా ఇప్పటివరకు అమల్లోకి రాకపోవడానికి కారణం ఒకటే. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో మతపరమైన హింసకు గురై.. భారత్‌కు వలసవచ్చిన హిందువులు, క్రైస్తవులు, జైనులు, బౌద్ధులు, సిక్కులు, పార్శీలకు భారత పౌరసత్వం అందించనున్నారు.

అయితే విదేశాల నుంచి వచ్చిన అన్నిమతాల వారికి పౌరసత్వం కల్పించి.. ఒక్క ముస్లింలకు మాత్రమే పౌరసత్వం ఇవ్వకూడదని నిర్ణయించడమే దేశంలో నిరసనలు, ఆందోళనలకు కారణం అయింది.

ఈ క్రమంలోనే దేశంలోని ముస్లింలు కూడా తీవ్ర అభద్రతా భావంతో ఉన్నారు. వారిలో కూడా తీవ్ర అనుమానాలు, ఆలోచనలు, భయాలు నెలకొన్నాయి. ఇక దేశంలో సీఏఏ(Citizen Amendment Act) అమల్లోకి వచ్చిన తర్వాత దేశంలోని ముస్లిం పౌరులపై ఎలాంటి ప్రభావం ఉంటుంది అనేది ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇంతకీ ఆ పౌరసత్వ సవరణ చట్టంలో మన దేశ ముస్లిం పౌరులకు గురించి పొందుపర్చిన అంశాలేంటి అనేది ఇక్కడ ప్రధాన విషయం.

ఈ పౌరసత్వ సవరణ చట్టం(Citizen Amendment Act) కేవలం విదేశాల నుంచి భారత్‌కు వలస వచ్చే వారి గురించే రూపొందించారు. దీని వల్ల ఇప్పటికే మన దేశ పౌరసత్వం కలిగి ఉన్న ఏ మతాల పౌరులకు ఎలాంటి ఇబ్బంది లేదు అని ఆ చట్టం తెలియజేస్తుంది. మరీ ముఖ్యంగా ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేస్తోంది.

కేవలం పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి భారతదేశానికి వలస వచ్చిన ముస్లిమేతర పౌరులు అంటే హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్శీలు, జైనులకు మాత్రమే.. భారత పౌరసత్వం కల్పించనున్నారు. అయితే ఆయా దేశాల నుంచి వచ్చిన ముస్లింలకు మాత్రం భారత పౌరసత్వం అందించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.

ఈ విధానమే ఇక్కడి ముస్లింలలో తీవ్ర భయాందోళన కలిగిస్తోంది. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి సహా బీజేపీ నేతలు అంతా ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చారు. సీఏఏ(Citizen Amendment Act) అమలు ద్వారా దేశంలోని ముస్లిం పౌరులకు ఎలాంటి సమస్య రాదని.. వారి పౌరసత్వానికి ఎలాంటి ఢోకా ఉండదని స్పష్టం చేశారు.

అయితే పాక్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ నుంచి వచ్చిన ముస్లింలకు పౌరసత్వం కల్పించకపోవడానికి గల కారణాలను కూడా ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసింది. ఆయా దేశాలు ముస్లిం మెజారిటీ దేశాలు అని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఏకంగా పార్లమెంటులోనే స్పష్టం చేశారు.

పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో మెజారిటీలు ముస్లింలు కావడంతో వారు హింసకు గురి కాలేదని అమిత్ షా తెలిపారు. ఆ దేశాల్లో మైనారిటీలుగా ఉన్న హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలు.. మత పరంగా తీవ్ర హింసను ఎదుర్కొన్నారని తెలిపారు. అందుకే ఈ 3 దేశాల్లోని ముస్లింలకు భారత దేశ పౌరసత్వం ఇవ్వడం లేదని తేల్చి చెప్పారు.

ఏయే ప్రాంతాల్లో అమలు చేయడం లేదు..

ఇక ఈ పౌరసత్వ సవరణ చట్టం(Citizen Amendment Act) రాజ్యాంగంలోని 6 వ షెడ్యూల్‌లో ఉన్న ప్రాంతాలు, ఈశాన్య ప్రాంతాల్లోని గిరిజనుల, స్థానిక ప్రజల ప్రయోజనాలను రక్షించేందుకు అక్కడ అమలు చేయడం లేదు.

ఇన్నర్ లైన్ పర్మిట్ సిస్టమ్ పరిధిలోకి వచ్చే ప్రాంతాలను పౌరసత్వ సవరణ చట్టం నుంచి మినహాయింపును ఇచ్చింది. అంటే అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ సహా ఈశాన్య రాష్ట్రాలకు వలస వచ్చిన హిందువులు, క్రిస్టియన్లు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, సిక్కులు భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

READ LATEST TELUGU NEWS: పొత్తుతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు లాభమా?

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS