Wednesday, October 16, 2024
Homeతెలుగుఆంధ్రప్రదేశ్DGP Office: ఉత్తమ మహిళా పోలీసులకు డీజీపీ అభినందన

DGP Office: ఉత్తమ మహిళా పోలీసులకు డీజీపీ అభినందన

DGP Office: మహిళా దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని డీజీపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో డీజీపీ కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా కార్యాలయంలోని సి‌ఐ‌డి, ఎఫ్‌ఎస్‌ఎల్, సాంకేతిక విభాగంలో విధులు నిర్వహిస్తూ.. ఉత్తమ ప్రతిభ కనబర్చిన మహిళా సిబ్బందికి బహుమతులను అందజేశారు.

ఈ సందర్భంగా డీజీపీ రాజేంద్రనాథ్ మాట్లాడుతూ మహిళలు అన్నీ రంగాల్లో తమ శక్తిని చాటుతున్నారని కొనియాడారు. అందుకు ఉదాహరణ అత్యంత కీలకమైన డీ.ఆర్.డీ.ఓ, ఇస్రో వంటి కీలక రంగాల్లో ప్రాజెక్టు డైరెక్టర్‌గా విజయవంతంగా ముందుకు సాగుతున్నారన్నారు. రాజకీయాల్లో సైతం మహిళలు అనేక పదవులలో రాణిస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నారని గుర్తుచేశారు.

తమ పోలీస్ శాఖ (DGP Office) మహిళల రక్షణ కోసం అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని డీజీపీ స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా అనేక కార్యక్రమాలను చేపట్టడంతో పాటు క్షేత్రస్థాయిలో మహిళలకు అండగా ఉంటున్నామని తెలిపారు. మహిళలపై జరిగే నేరాల ఫిర్యాదుల కోసం దిశ పోలీస్ స్టేషన్లు, వేధింపుల నుంచి రక్షణ కల్పించడానికి దిశ యాప్ అందుబాటులోకి తెచ్చామన్నారు.

దిశ మొబైల్ అప్లికేషన్ ద్వారా రాష్ట్రంలోని మహిళలకు ఎలాంటి సమయంలోనైనా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ తెలిపారు. అత్యంత ఆధునిక టెక్నాలజీతో ప్రవేశ పెట్టిన దిశా మొబైల్ అప్లికేషన్ (SOS) అత్యంత స్వల్ప వ్యవధి లోనే 1,30,00,000 మందికిపైగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఒక గొప్ప విశేషం అన్నారు. ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటున్న చర్యల ద్వారా ఊహించిన దానికంటే రక్షణ అంశంలో మంచి ఫలితాలు వస్తున్నాయి.

READ LATEST TELUGU NEWS : పార్టీలు ఎన్నికల నిబంధనలు పాటించాల్సిందే

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS