Yellow Alert In Summer: తెలంగాణకు వడగాలుల ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నేటి నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు పగటిపూట వడగాలులు వీచే అవకాశం ఉన్నట్టు తెలిపింది.
రాష్ట్రంలో 16 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, కామారెడ్డి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలు ఈ ఎల్లో అలెర్ట్(Yellow Alert In Telangana) జాబితాలో ఉన్నాయి.
ఈ ఏడాది మొదటిసారి వడగాలులు నల్గొండ జిల్లాలో నమోదయ్యాయి. శనివారం వేములపల్లి మండలంలో 42.7 డిగ్రీలు, నిడమనూరు మండలంలో 42.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు(Summer Temperatures) నమోదయ్యాయి.
రాష్ట్రంలో కొద్ది రోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రుళ్లు కూడా సాధారణం కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. దీంతో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్(Yellow Alert In Summer) జారీ చేసింది.